పులిచింతల ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ టిడిపి మాజీ ఎం.ఎల్.ఏ బొల్లినేని రామారావు అనేది పచ్చి అబద్దం. పులిచింతల ప్రాజెక్టు పనుల నిర్వహణలో కాంట్రాక్టరుకు రూ.56.52 కోట్ల అనుచిత లబ్ది చేకూరింది'' అని 2009-10లో కాగ్ వైఎస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. టిడిపి నేత నిమ్మల రామానాయుడు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టును 1988 నవంబర్ 13న ఎన్.టి.ఆర్ గారు మొదట శంకుస్థాపన చేశారు. 1994-95లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.501 కోట్లు. 2004 అక్బోబర్ 15న పులిచింత ప్రాజెక్టుకు వైఎస్ భూమి పూజ చేశారు. 30-9-2004 తేదీన మెస్సర్స్ శ్రీనివాస కన్స్ట్రక్షన్ లిమిటెడ్ మరియు చైనా రైల్వే 18 బ్యూరో జాయింట్ వెంచర్ తో వైఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడమైంది. 18.11.2005న జీవో నెం. 208 ద్వారా సవరించిన అంచనా రూ.681 కోట్లు. 04.08.2009న జీవో నెం. 90 ద్వారా వైఎస్ ప్రభుత్వం సవరించిన అంచనా వ్యయం రూ.1281 కోట్లు. 29.01.2014న జీవో నెం. 7 ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సవరించిన అంచనా వ్యయం రూ.1861 కోట్లు. భూసేకరణలో జాప్యంల వలన ధరలు పెరిగినందుకున అధనంగా రూ.285 కోట్లు ఇవ్వాలని శ్రీనివాస్ కన్ స్ట్రక్షన్ 2012లో ప్రభుత్వాన్ని కోరారు. దీనిని పరిశీలించిన డీఏబీ రూ.199 కోట్లను అధనంగా చెల్లించాలని 03.10.2013న ప్రతిపాధించారు. ఇది అమలు కాకపోవడంతో కోర్టుకు వెళ్లారు. సుదీర్ఘంగా విచారణ జరిపి మచిలీపట్నం కోర్టుకు 02.06.2016న రూ.199 కోట్లతో పాటు 2013 నుండి వడ్డీ కల్పి రూ.399 కోట్లు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. దానిపై హైకోర్టుకు ప్రభుత్వం వెళ్లగా కాంట్రాక్టరుకు చెల్లించాల్సిన మొత్తంలో 50 శాతం అనగా రూ.199 కోట్లను డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాన్ని 01.01.2019న ప్రభుత్వం అమలు పరిచింది. 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పులిచింతల మునక రైతుల పరిహారం కోసం రూ.128 కోట్లు మరియు హైకోర్టు ఆదేశాల మేరకు రూ.199 కోట్లు మాత్రమే చెల్లింపులు చేయడమైంది. ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వాసితులకు పరిహారం చెల్లించి వారిని ఖాళీ చేయించడంలో వైఎస్ గాని, కాంగ్రెస్ గాని తగినంత శ్రద్ధ పెట్టలేదు. అందువలన ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగి, దానిపై కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లారు.వారు చేసిన పాపానికి చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల ప్రకారం రూ.199కోట్లు చెల్లించింది. మరో 128 కోట్లు భూములు కోల్పోన రైతులకు చెల్లించింది.
వైఎస్ ప్రభుత్వం కమీషన్లు పుచ్చుకునే పనులకు నిధులు విడుదల చేసి, రైతులకు పరిహారంలో కమీషన్లు రావు కనుక దాన్ని నిర్లక్ష్యం చేసింది. పులిచింతల కాంట్రాక్టు సంస్థకు ఉదయగిరి తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు బొల్లినేని రామారావుకు సంబంధం లేదు. ఆ కాంట్రాక్టర్ కుటుంబం కాంగ్రెస్ లో ఉండేది. వైఎస్ తో సన్నిహితంగా ఉండేది. ఈ వాస్తవాన్ని సాక్షి తలకిందలు చేసి ఫేక్ వార్త రాసి చంద్రబాబుకు అంటకట్టడం వారి అబద్దాల చరిత్రలో మరో పచ్చి అబద్దం. పులిచింతల పూర్తి చేసిన ఘనత వైఎస్ ది అని అక్కడ 45 అడుగుల వైఎస్ విగ్రహంతో స్మృతివనం ఏర్పాటు చేస్తామని 07.10.2019న నీటి పారుదల శాఖా మంత్రి అనీల్ కుమార్ ప్రకటించారు. జగన్ రెడ్డి కూడా ఆ ఘనత తమదే అన్నారు. మరి పులిచింతల గేటు కొట్టుకుపోయిన పాపం పూర్తిగా జగన్ కుటుంబానిది కాదా? జగన్ రెడ్డికి గాని, బెట్టింగ్ మంత్రి అనిల్ కు కానీ వీటి మీద అవగాహానే లేదు. పై నుంచి వరద వస్తున్నా ఫ్లడ్ కుషన్ మైంటైన్ చేయలేదు. ఈ వైఫల్యం వల్లే పులిచింతల గేటు కొట్టకపోయింది. నీరు సముద్రం పాలయ్యాయి. రైతులకు ద్రోహం చేశారు. దీని కప్పిపెట్టుకోవడానికి దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు తెలుగుదేశంపై పచ్చి అబద్దాల రాతలు రాయించారు. ఇది ఒక ఫేక్ పత్రిక – ఫేక్ నేత చేతిలో ఉన్న ఫేక్ పత్రిక. గేట్లను అమర్చడానికి నిర్మించే పియర్స్ లో ఒక గేటుకు, ఇంకో గేటుకు మధ్య గ్యాప్ గరిష్ఠంగా ఆరు మిల్లీ మీటర్లకు మించి ఉండకూడదని తెలిసినా, పులిచింతలలో 400 మిల్లీమీటర్లకు పైగా పెట్టారు. దీంతో గేట్ల పై ఒత్తిడి పెరిగింది. మొత్తంగా సివిల్ పనుల్లో, మెకానికల్ పనుల్లో కూడా లోపాలతో ప్రాజెక్ట్ నిర్మాణం చేసారు. 754.59 మీటర్ల దూరం స్పిల్వే నిర్మించాల్సి ఉండగా, 546 మీటర్లకు తగ్గించారు. 33 గేట్లు పెట్టాల్సి ఉండగా, కేవలం 24 గేట్లు పెట్టారు. కాంక్రీటు డ్యాం నిర్మించాల్సి ఉండగా, 355 మీటర్ల మట్టికట్ట నిర్మాణం చేపట్టారు. డిజైన్ మార్చి, స్పిల్ వే తగ్గించటం, గేట్లు తగ్గించటం, కాంక్రీటు డ్యాం లేకుండా మట్టి మట్టికట్ట నిర్మాణం చేయటంతో, మొత్తంగా ఈ రోజు వరద ఉదృతికి, గేటు కొట్టుకుపోయింది. జలయజ్ఞంలో జరిగిన ధనయజ్ఞంలో భాగంగానే డిజైన్ మార్పులు నాశిరకం పనులు జరిగాయి. తండ్రిని అడ్డం పెట్టుకొని నాడు జగన్ రెడ్డి కమీషన్లు కొల్లగొట్టారు. ఆ పాపమే నేటి పులిచింతల దుస్థితి. చంద్రబాబు ప్రభుత్వం, ఈ నాసిరకం పనులు దృష్టిలో పెట్టుకునే, పూర్తిస్థాయిలో నీటిని నిల్వను ఎప్పుడూ చేయలేదు. జాగ్రత్తగా ఫ్లడ్ మానిటర్ చేస్తూ, డ్యాంను కాపాడుతూ వచ్చారు. డ్యామ్ మెయిన్ టినెన్స్ కు నిధులు కేటాయించారు.