ఏ అభివృద్ధైనా ఆ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి పైనే ఆధారపడి ఉంటుందని, దానికి విరుద్ధంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం భయంతో పరుగులపెట్టిస్తోందని, మోహన్ దాస్ పాయ్ అన్న దానికి అమర్ రాజా గ్రూప్ రాష్ట్రం నుంచి తరలిపోవడమే నిదర్శనమని టీడీపీ అధికారప్రతినిధి సప్తగిరి ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన తన నివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! తిరుపతిలోని రేణిగుంట సమీపంలో రూ.15వేలకోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్న రిలయన్స్ సంస్థ ఇప్పటికే రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది. దానితోపాటు నేడు అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కూడా చెన్నైకి తరలి పోవడానికి సిద్ధమైంది. రాయలసీమ ప్రాంతంలో ఒక ప్పుడు ఉపాధిలేక పొరుగు రాష్ట్రాలకు వలసపోయే వారికెందరికో అమర్ రాజా సంస్థ బతుకుదెరువు చూపించించింది. అమర్ రాజా సంస్థ సీమలో వలసలను ఆపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. యువత ఉపాధి కోసం ఫ్యాక్షనిజం బాట పడుతున్న సమయంలో అమర్ రాజా సంస్థ వారికి ఉన్నత మార్గాన్ని చూపింది. అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోతే, ప్రత్యక్షంగా, పరోక్షంగా కంపెనీపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 12వేల మంది తీవ్రంగా నష్టపోతారు. అంతమంది ఉద్యోగులకు కన్నీళ్లు మిగల్చడం ద్వారా జగన్ ప్రభుత్వం ఏం సాధించింది? అమర్ రాజా సంస్థలు రాష్ట్రం నుంచి వెళ్లిపోవడం వల్ల రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంది. ఉద్యోగుల పిల్లలతో పాటు, సీమలోని పేదలకు తక్కువ ఖర్చుకే అమర్ రాజా సంస్థ విద్యను అందిస్తోంది. పరిశ్రమల శాఖా మంత్రి పేరులో శ్రమ ఉంది గానీ, రాష్ట్రంలో పరిశ్రమల కోసం ఆయన పడుతున్న శ్రమశూన్యం. ఇంకా సిగ్గులేకుండా రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెబుతున్నాడు. ఎక్కడ ఏప్రాంతంలో మేకపాటి గౌతమ్ రెడ్డి పెట్టుబడులుపెట్టించాడో చెప్పాలని, అవసరమైతే, తన వ్యాఖ్యలపై ఆయన నిజ నిర్థారణ కమిటీ వేయాలని పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దాదాపు రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంనుంచి తరలిపోయాయి. అదానీగ్రూప్ రూ.70వేల కోట్ల పెట్టుబడి, లులూ గ్రూప్ రూ.2,200కోట్లు, బీఆర్. షెట్టి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూ.12వేలకోట్ల పెట్టుబడి, సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్ట్ రూ.50వేలకోట్ల పెట్టుబడి రాష్ట్రం నుంచి పరారైంది. రాయలసీమకే తలమానికమైన కియా పరిశ్రమకు చెందిన అనుబంధ పరిశ్రమలు 17, రూ.2వేలకోట్ల పెట్టుబడి పెట్టకుండా రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయన్నారు. ఒంగోలులలోని ఏపీ పేపర్ పల్ప్ మిల్స్ వారు , ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటివి ఎప్పుడో పరారయ్యాయన్నారు. జువారీ సిమెంట్స్, హెరిటేజ్, సంగం డెయిరీ సంస్థలను వేధిస్తున్నారు. ఉద్యోగస్తులపై ఏసీబీ, ప్రతిపక్షాలపై జేసీబీ, పరిశ్రమలు, కంపెనీలపై పీసీబీ ని పంపడం ప్రభుత్వానికి రివాజుగా మారింది. మాట వినని వారిపైనే ముఖ్యమంత్రి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు. కడపలోని జువారీ సిమెంట్స్ సంస్థ నుంచి పొల్యూషన్ వస్తోందని, చెబుతోందన్న జగన్మోహన్ రెడ్డి తన భారతి సిమెంట్స్ నుంచి పొల్యూషన్ రాకుండా పంచామృతం, పన్నీరు లాంటివి వస్తున్నాయేమో చెప్పాలి.

పరిశ్రమలను తరలించడంతోపాటు, జాబ్ లెస్ క్యాలెండర్ తో ముఖ్యమంత్రి నిరుద్యోగులకు కన్నీళ్లు మిగిల్చాడు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్రం ఇప్పటికే సీరియస్ అయింది. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అనే డూప్లికేట్ కార్పోరేషన్ పెట్టి, పంచాయతీ కార్యాలయాలు, మండల కార్యాలయాలు కూడా తాకట్టుపెట్టే దుస్థితికి వచ్చారు. చివరకు పథకాలను కూడా నిలిపేసే దుస్థితికి ప్రభుత్వం వచ్చింది. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర యవతకు, నిరుద్యోగులకు జగనన్న కొబ్బరిచిప్పల పథకం పేరుతో వారిచేతుల్లో చిప్పపెడతాడు. ముఖ్యమంత్రి ఒక్కసారి అమర్ రాజా సంస్థ చరిత్రను గమనించాలి. ఆ సంస్థ రాష్ట్రంలో పరిశ్రమ పెడతామని చెప్పినప్పుడు, సంస్థ యజమానులు ఏ పార్టీలో ఉన్నారని కూడా చూడకుండా, నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ భూములు కేటాయించారు. పరిశ్రమ పెడితే రాయలసీమ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని మాత్రమే ఆనాడు ఆయన ఆలోచించాడు. చిత్తూరు ప్రాంతంలో ఎక్కడికెళ్లి అడిగినా, అమర్ రాజా సంస్థ యజమానులెవరో తమకు తెలియకపోయినా, ఉపాధి పొందినవారు వారు తినే అన్నం ముద్దను చూపుతారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు లేవని, పరిశ్రమలను తన్ని తరిమేస్తున్నారని లండన్ కు చెందిన పత్రికే చెప్పింది. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతే, ముఖ్యమంత్రికి, సజ్జల రామకృష్ణారెడ్డికి వచ్చిన నష్టమేమీ లేదని, నష్టపోయేదల్లా నిరుద్యోగులు, యువతే. భారతిసిమెంట్స్ లోగానీ, సాక్షి పేపర్ లో గానీ ముఖ్యమంత్రి యువతకు, ఉపాధి కల్పిస్తాడా? అమర్ రాజా సంస్థలో పనిచేసుకుంటున్న వారికి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి సంస్థలో ఏమైనా ఉపాధి కల్పిస్తాడా? ఒక పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోతుందంటే పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? చంద్రబాబునాయుడు సెల్ కాన్ మొబైల్ పరిశ్రమను, రేణిగుంట శ్రీసిటీలో నెలకొల్పారు. రాష్ట్రంనుంచి పరిశ్రమలు పరారవుతున్నాయి. మైనింగ్ పేరుతో రాష్ట్రంలోని సహజవనరులను వైసీపీ దొంగలు దోచుకుంటున్నారు. ఈ వ్వవహారంపై ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు , మేథావులు స్పందించకపోతే, చివరకు రాష్ట్రంలో బతకలేక అందరూ పొరుగురాష్ట్రాలకు వలసపోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా తన విధానం మార్చుకొని , ఏపీకి పరిశ్రమలు వచ్చేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. మేకపాట్ గౌతమ్ రెడ్డిచెప్పిన రూ.6లక్షలకోట్ల పెట్టుబడి ఎక్కడుందో, ఆయనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వచ్చాక రాష్ట్రానికి అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమ కూడా రాలేదనే వాస్తవం గౌతమ్ రెడ్డికి తెలియదా?

Advertisements

Advertisements

Latest Articles

Most Read