పులిచింతల ప్రాజెక్ట్ లో, ప్రమాదం జరిగింది. పై నుంచి వస్తున్న వరద తాకిడి సమయంలో, ఈ రోజు ఉదయం మూడు గంటలకు, నీటిని విడుదల చేసే క్రమంలో గేట్లు తెరుస్తూ ఉండగా, ఒక్కసారిగా 16వ నంబరు గేటు ఊడిపోయింది. పులిచింతల ప్రాజెక్టు ప్రస్తుతం ఇన్‍ఫ్లో వచ్చి లక్షా 10 వేల క్యూసెక్కులుగా ఉంది. ఇన్‍ఫ్లో ఆధారంగా చేసుకుని, నీటికి కిందకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే, 16వ నంబర్ గేటు ఊడిపోయి , నీళ్ళు అన్నీ వృధాగా పోతున్నాయి. పులిచింతల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధం 45.77 టీఎంసీలుగా ఉంది. అయతే ఈ నేపధ్యంలోనే మిగతా గేట్లు పై ఈ ఒత్తిడి పడి, మిగతా గేట్లు కూడా ఇబ్బంది వస్తుందని భావిస్తున్న అధికారులు, మిగతా గేట్లు కూడా ఎత్తి నీటికి కిందకు విడుదల చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఊడిపోయిన గేటు స్థానంలో తాత్కాలికంగా మరో గేటు ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి అనిల్ కుమార్, ఇతర అధికారులు డ్యాం వద్దకు వెళ్లి, ఏమి చెయ్యాలి అనే సమాలోచనలు జరిపారు. ఇతర సాంకేతిక నిపుణులను కూడా అక్కడకు రప్పించారు. గతంలో పులిచింతల గేటు బెగించిన బెకాన్ సంస్థ అధికారులను కూడా పిలిపిస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలిక గేటు ఏర్పాటు ఒక్కటే మార్గం అని, ముందు ఆ పనులు చేయాలని డిసైడ్ అయ్యారు.
అయితే గేటు పెట్టాలి అంటే, ప్రవాహాన్ని ముందు ఆపాల్సి ఉంటుంది. అందుకే పులిచింతల నుంచి నీళ్ళు భారీగా కిందకు వదిలేయాలని డిసైడ్ అయ్యారు. దాదాపుగా 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు. అంటే పులిచింతల దాదాపుగా ఖాళీ చేస్తున్నారు. మరో పక్క అయినా పై నుంచి పులిచింతలకు వరద వస్తుంది. అయితే పులిచింతల నుంచి భారీగా నీళ్ళు విడుదల చేయటంతో, ప్రకాశం బ్యారీజికి ఫ్లాష్ ఫ్లడ్ వస్తుంది. దీంతో జిల్లా కలెక్టర్ జె.నివాస్ అందరినీ అలెర్ట్ చేస్తున్నారు. 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ష్ ఫ్లడ్ వచ్చి చేరుతుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా నది పరివాహక ప్రాంత ప్రజలు, ఇప్పుడు వరద లేదు కాబట్టి రిలాక్స్ అయి ఉంటారు, ఇంత తక్కువ సమయంలో వారిని అలెర్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాగులు, వంకలు కాలువలకు కూడా ఫ్లాష్ ఫ్లడ్వస్తుంది కాబట్టి, అక్కడ కూడా అలెర్ట్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ పరిస్థితిని అధికారులు సమర్ధవంతంగా ఎదుర్కుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తారని ఆశిద్దాం..