ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ ఉపాధి హామీ పధకం, అంటే నరేగా బిల్లుల చెల్లింపులకు సంబంధించి, రాష్ట్ర హైకోర్టులో దాదాపుగా ఏడు నెలల నుంచి విచారణ జరుగుతుంది. ఈ విచారణ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. గతంలో విచారణ జరుగుతున్న సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం, గత టిడిపి హయాంలో ఉన్న వారికి బిల్లులు చెల్లింపులు చేయకపోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ అందులో ఏమైనా అవకతవకలు ఉంటే వాటి వరుకు, వాటిని నిలుపుదల చేసి, మిగతా బిల్లులను చెల్లించాలని ఆదేశించింది. అయితే రూ.2500 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాల్సి ఉందని గతంలో డిఫెన్స్ న్యాయవాదులు పేర్కొన్నారు. అయితే మొత్తం 1,794 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ బిల్లులు మొత్తాన్ని కూడా చెల్లించాలని కూడా గతంలో రాష్ట్ర హైకోర్టు, ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆగస్ట్ 1 లోపు బిల్లులు అన్నీ చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ రోజు కేసు వాయిదా వేసింది. ఈ రోజు ఉన్న వాయిదాకి ఫైనాన్సు ప్రిన్సిపల్ సెక్రటరీ, అదే విధంగా పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీలను కూడా హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రొజు ఇదే అంశం పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే అధికారుల్లో ఈ రోజు, కేవలం పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మత్రమే హాజరు అయ్యారు. ఫైనాన్సు ప్రిన్సిపల్ సెక్రటరీ హాజరు కాలేదు.

hc 04082021 2

దీని పై హైకోర్టు సీరియస్ అయ్యింది. అయితే ఆయన పిటీషన్ దాఖలు చేస్తూ, ఢిల్లీలో ఆర్బిటరేషన్ ఉందని ఒకసారి, అదే విధంగా మీటింగ్ ఉందని మరోసారి చెప్తున్నారని చెప్పి, ఇది మంచి పధ్ధతి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏ కారణం చెప్తున్నారు, మీరు చెప్తున్న సాకులు కూడా అఫిడవిట్ లో లేవని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది. 1,794 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, 413 కోట్ల రూపాయలు చెల్లించామని ప్రభుత్వం కోర్టుకు చెప్పగా, డిఫెన్స్ న్యాయవాదులు మాత్రం అది తప్పుడు సమాచారం అని, కేవలం 43 కోట్లు మాత్రమే చెల్లించారని స్పష్టం చేసారు. దీంతో హైకోర్టు ఆ 413 కోట్ల రూపాయలు లెక్క ప్రభుత్వాన్ని అడిగింది. అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. వచ్చే వాయిదాకు అధికారులు వచ్చి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే చెల్లించిన బిల్లులో 20 శాతం మినహాయించారని చెప్పగా కోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. అలా ఎందుకు చేసారు, ఆ డబ్బులు ఎక్కడ ఉంచారు అని ప్రశ్నించింది. ఎలాంటి వివరాలు లేకుండా కోర్టుకు ఎందుకు వస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. ఎన్ని సార్లు చెప్పినా హైకోర్టు ఆదేశాలు పట్టించుకోవటం లేదని, ఇదే విధంగా వ్యవహరిస్తే తీవ్రమైన ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read