సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేసారు. జార్ఖండ్‍లో జడ్జి హ-త్య కేసుపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేసారు. జడ్జిల రక్షణకు చేపట్టిన చర్యల వివరాలు అందించాలని అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసారు. ఈనెల 17లోగా వివరాలు అందించాలని అన్ని రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చారు చీఫ్ జస్టిస్. ఈ నోటీసులు జారీ చేసింది సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం. వివిధ రాష్ట్రాల్లో జడ్జిలపై ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయో గమనిస్తున్నారా అంటూ ఆగహ్రం వ్యక్తం చేసారు. కేంద్రం ఏం చేయాలనుకుంటోంది అంటూ అటార్నీ జనరల్‍ను చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. సంఘటన జరిగిన రోజునే 22 మంది సభ్యుల సిట్‍ను ఏర్పాటు చేశామని న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే సిట్‍ను ఏర్పాటు చేసినట్లు ధర్మాసనానికి తెలిపారు జార్ఖండ్ ప్రభుత్వ న్యాయవాది. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని జార్ఖండ్ న్యాయవాది సుప్రీం కోర్టుకు తెల్పారు. నిన్నటి నుంచి సీబీఐ కేసు దర్యాప్తును ప్రారంభించిందని జార్ఖండ్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు చెప్పింది. అయితే ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. సీబీఐ కేసు ప్రారంభించిందని మీరు చేతులు దులుపుకొన్నారా? అంటూ ప్రశ్నించారు.
2019లో ఇలాంటి సందర్భంలో జారీచేసిన నోటీసులకు కేంద్రం ప్రత్వుత్తరం ఇవ్వాల్సి ఉంది అని అన్నారు. కొన్ని సందర్భాల్లో సీబీఐ విచారణకు ఆదేశాలిచ్చినా.. సీబీఐ ఏం చేయలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రత్యుత్తరంపై కేంద్రం ఇప్పటిదాకా స్పందించలేదని అన్నారు. కేంద్రం ప్రభుత్వం ఒక వారంలో సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసారు. గ్యాంగ్‍స్టర్లు, ఉన్నత స్థాయి వ్యక్తులకు సంబంధించిన అనేక కేసులు దేశంలో ఉన్నాయని అన్నారు. గ్యాంగ్‍స్టర్లు, కొందరు వ్యక్తులు న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు అంటూ చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా, ఎకంగా ప్రభుత్వమే జడ్జిల పై అనేక ఆరోపణలు చేస్తూ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఏకంగా ఇప్పుడు చీఫ్ జస్టిస్ గా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ పైనే, అప్పట్లో ఆయనకు వ్యతిరేకంగా లేఖ రాయటం పెను సంచలనం అయ్యింది. ఈ రోజు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ఈ సంఘటన కూడా గుర్తు చేసుకోవాల్సి ఉంటుందని, విశ్లేషకులు అంటున్నారు.