ఎంపీటీసీ, జడ్పీటీసీ లెక్కింపు పై, ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేయాలి అంటూ, సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై, డివిజినల్ బెంచ్ కు ప్రభుత్వం వెళ్ళటం, అలాగే డివిజనల్ బెంచ్ సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వటం తెలిసిందే. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ లెక్కింపు పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించగా, ఎన్నికల కమిషన్ తరుపున సీనియర్ న్యాయవాది నిరంజన్‍రెడ్డి వాదనలు వినిపించారు. పిటీషనర్ తరుపున న్యాయవాది వేణుగోపాల రావు వాదనలు వినిపించారు. ప్రధానంగా ఎన్నికల కమీషనర్ తరుపున నిరంజన్‍రెడ్డి వాదనలు వినిపిస్తూ, పంచాయతీ ఎన్నికలకు నాలుగు వారాలు గడువు ఉండే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుందని, తరువాత కో-వి-డ్ కారణంగా ఎన్నికలు వాయిదా పాడి, ఆ తరువాత జరిగిన ఎన్నికలకు నాలుగు వారాలు అవసరం లేదని కోర్టుకు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పులో ఇచ్చిన నాలుగు వారల గడువు అనేది, ఒకసారి ఇంప్లిమెంట్ చేసామని కోర్టుకు తెలియచేసారు. దీంతో పాటుగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి వాదనలు వినిపించారు.

hc 05082021 2

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం 22 రోజులు సమయం ఇచ్చామని చెప్పారు. కో-వి-డ్ కేసులు పెరుగుతున్నాయి కాబట్టే ఎన్నికలు త్వరగా నిర్వహించి రాష్ట్రంలో ప్రజలకు కో-వి-డ్ పాకకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక పిటీషనర్ తరుపున వాదనలు వినిపిస్తూ, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులో ఉద్దేశాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రతి ఎన్నికకు ముందు నాలుగు వారల గడువు ఉండి తీరాల్సిందే అనే విషయాన్ని సుప్రీం కోర్టు చెప్పిందని చెప్పారు. పైగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు, పంచాయతీ ఎన్నికలు, పురపాలక ఎన్నికలు వేరు వేరుగా నిర్వహించారని గుర్తు చేసారు. ఒక ఎన్నికకు నాలుగు వారాలు ఇచ్చాం, ఇంకో దానికి ఇవ్వం అంటే ఎలా అని ప్రశ్నించారు. ఇక ప్రభుత్వం తరుపున వాదనలు వినిపిస్తూ, ఇప్పటికే 150 కోట్లు ఎన్నికల కోసం ఖర్చు చేసామని, బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నాయని చెప్పారు. హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఎన్నికలు జరిపామని చెప్పారు. అన్ని వైపుల నుంచి వాదనలు విన్న ధర్మాసనం తీర్పుని రిజర్వ్ లో పెట్టింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read