జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసమే నిర్వహించిందని, చెట్లను అడ్డంగా న-రి-కే-స్తూ అడ్డగోలుగా మాఫియా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మొక్కలు నాటాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... విశాఖపట్నం నుంచి కృష్ణా జిల్లా మైలవరం వరకు దాదాపు 40 నియోజకవర్గాల్లో వందలాది ఎకరాల అడవులను నాశనం చేసిన ఘనత వైసీపీ ప్రముఖులకే దక్కింది. వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా పచ్చదనాన్ని ధ్వంసం చేస్తోంది. దాన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే నేడు ముఖ్యమంత్రి జగనన్న పచ్చ తోరణం పేరుతో కామిడీ తోరణాన్ని ప్రారంభించారు. అటవీశాఖ అధికారి విజయకుమార్ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాల్సిన అధికారులు వైసీపీ కార్యకర్తల కంటే హీనంగా తయారయ్యారు. అందుకు నిదర్శనం విజయకుమార్ వ్యాఖ్యలే. రష్యన్, ఫ్రెంచి విప్లవాల తరువాత రాష్ట్రంలో ఆ స్థాయిలో రాష్ట్రంలో నిరుద్యోగ విప్లవం వచ్చిందని.. ఆ విప్లవం కారణంగా రాష్ట్రంలో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు పెల్లుబుకుతున్నాయని విజయ్ కుమార్ ముఖ్యమంత్రికి చెప్పి ఉండాల్సింది. విజయ్ కుమార్ ఐఏఎస్ అధికారిననే విషయం మరచిపోయి రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కంటే ఘోరంగా మాట్లాడాడు. ఎస్సీ కార్పొరేషన్ కు వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తానన్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మాట తప్పాడు. ఆ విషయం విజయకుమార్ ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించివుంటే బాగుండేది. జగన్ మాట ఇస్తే అమలు చేస్తాడని సినిమా డైలాగులు చెబుతున్న విజయ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ నిధులను ముఖ్యమంత్రి దారి మళ్లించిన వైనం పై స్పందిస్తే బాగుండేది. జగన్ మాటిస్తే మాట తప్పుతాడని విజయ్ కుమార్ గుర్తించాలి. నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగాలు ఇస్తానని, ఎస్సీలకు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయిస్తానని జగన్ మాట ఇచ్చి తప్పలేదా? ఒకటవ తారీఖు కి జీతాలు అందని దాని గురించి విజయ్ కుమార్ ఉద్యోగుల తరపున మాట్లాడాల్సింది. ఉద్యోగులకు జగన్ అమలు చేస్తానన్న పీఆర్సీ, డీఏ ల చెల్లింపు, సీపీఎస్ ల రద్దు ల గురించి విజయకుమార్ మాట్లాడి ఉంటే ఉద్యోగులందరూ హర్షించేవారు. విజయకుమార్ ముఖ్యమంత్రిని పొగడ్తలతో ముంచెత్తడం దళితుడిగా చేశాడా లేక ఐఏఎస్ అధికారిగా చేశాడా అనే దానిపై ఆయనే సమాధానం చెప్పాలి. విజయకుమార్ గతంలో కూడా జగన్ పుట్టిన రోజు సందర్భంగా పాటలు పాడాడు. గతంలో టీడీపీ హయాంలో విజయ్ కుమార్ పనిచేశాడు. ఆనాడు దళితులకు చంద్రబాబు ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేసిందో, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏమి అమలు చేస్తోందో విజయకుమార్ కు తెలియదా?
విజయకుమార్ కు రాజకీయాల్లోకి రావాలని ఉంటే తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రవీణ్ కుమార్ లా రాజకీయాల్లో చేరితే అది మగతనం అవుతుంది. గతంలో తనపై వచ్చిన వివిధ రకాల ఆరోపణలపై ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదనే విజయకుమార్ నేడు ముఖ్యమంత్రిని ఆకాశానికెత్తాడు. కేవలం రాజకీయ కంపు, రాజకీయ కక్ష సాధింపులతోనే జగన్ అమరరాజా సంస్థను సాగనంపుతున్నాడు. కొన్ని వేల కుటుంబాలను రోడ్డన పడేశాడు. అటువంటి దుర్మార్గాలపై విజయకుమార్ ఎందుకు స్పందించలేక పోతున్నాడు? ఐఏఎస్ అధికారిగా ఉన్న విజయకుమార్ నేడు చేసిన వ్యాఖ్యలు ఆయనలోని బానిస భావజాలానికి సంకేతంగా నిలిచాయి. ఉన్నత స్థాయి ఉద్యోగులే ముఖ్యమంత్రికి ఊడిగం చేస్తుంటే కిందిస్థాయి ఉద్యోగులు ఏం చేస్తారు? విజయకుమార్ ఏ శాఖలో పనిచేస్తున్నాడో సదరు శాఖకు సంబంధించే దాదాపు 48 నియోజకవర్గాల్లో చెట్ల న-రి-కి-వే-త-లు జరుగుతుంటే ఆయన ఏం చర్యలు తీసుకున్నారు. ఆయన నిజమైన ఐఏఎస్ అధికారే అయితే తక్షణమే అటవీ ప్రాంతంలో జరుగుతున్న చెట్ల న-రి-కి-వే-తపై చర్యలు తీసుకొని దోషులను శిక్షించాలి. ముఖ్యమంత్రి ముందు ఉత్తుత్తి ప్రతిజ్ఞలు చేసే విజయకుమార్ వందల చెట్లను న-రి-కి-వే-సి-న వారిని ఎందుకు శిక్షించలేక పోయారు? అరకు అటవీ ప్రాంతంలో కిలో మీటర్ల దూరం అడవిలో వేసిన భారీ రహదారి విజయకుమార్ కు కనిపించడంలేదా? విజయకుమార్ ముఖ్యమంత్రికి ఊడిగం చేయాలనుకుంటే తన ఉద్యోగానికి రాజీనామా చేసి తక్షణమే వైసీపీ కండువా కప్పుకోవాలి. దళితుల ఆత్మ గౌరవాన్ని మంట గలిపేలా డాక్టర్ సుధాకర్ ను బట్టలు లేకుండా పోలీసులు నడి రోడ్డుపై ఈడ్చికెళ్లినప్పడు విజయకుమార్ ఎందుకు స్పందించలేదు? దళితులపై రాజకీయ హ-త్య-లు, శిరో ముండనాలు, దా-డు-లు, వేధింపులు, దళిత మహిళలపై అ-త్యా-చా-రా-లు జరిగినప్పుడు ముఖ్యమంత్రిని విజయకుమార్ ఎందుకు నిలదీయ లేకపోయాడు? విజయకుమార్ కేవలం తన స్వార్థం కోసం ముఖ్యమంత్రి భజన చేసిసిగ్గు లేకుండా ప్రజల ముందు ఆయనకు బాకాఊదాడు.