కొద్ది సేపటి క్రితం మాజీ మంత్రి, టిడిపి నేత దేవినేని ఉమకు ఏపి హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. గత నెల 28వ తేదీన జీకొండూరులో దేవినేని ఉమను అరెస్ట్ చేసారు. ఆయన పై కుట్ర కేసుతో పాటుగా, ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు, హ-త్యా-య-త్నం కేసు సహా, మొత్తం 18 కేసులు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేసారు. ఈ నేపధ్యంలోనే కారు అద్దాలు పగలగొట్టి మరీ, జీకొండూరు పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి, కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని పెదపారుపూడి, ఆ తరువాత నందివాడ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. ఆ తరువాత వెంటనే ఆయన్ను వెంటనే మైలవరం మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. హాజరు చేసిన వెంటనే, ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతం దేవినేని ఉమా, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకుని వెళ్ళిన తరువాత, అక్కడ జైలు ఆఫీసర్ ని కూడా బదిలీ చేసారు. దీని ఫై కూడా దుమారం రేగి, చివరకు ఉమా సతీమణి చీఫ్ జస్టిస్ కు, గవర్నర్ కు కూడా లేఖలు రాసే దాకా వెళ్ళింది. ఈ నేపధ్యంలోనే హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. నిన్న ఈ బెయిల్ పిటీషన్ కు సంబంధించి, ఇరు పక్షాల వాదనా కూడా హైకోర్టు వింది. దేవినేని ఉమా తరుపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వరులు వాదనలు వినిపించారు.
ఈ కేసులో ఎవరికీ కూడా హాని జరగలేదని, అసలు దీంట్లో 307 వర్తించదు అని వాదించారు. అదే విధంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బంధువు కారు డ్రైవర్ కులం ఏమిటో, దేవినేని ఉమాకు ఎలా తెలుస్తుంది అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ కక్షతోనే ఈ కేసు మోపారని చెప్పారు. దీనికి సంబంధించి కొన్ని సాంకేతిక ఆధారాలు కూడా హైకోర్టు ముందు ప్రస్తావించారు. తన పై దా-డి చేసారని ఇచ్చిన కంప్లైంట్ సమయం చూస్తే, ఆ సమయంలో దేవినేని ఉమా మీడియాతో లైవ్ లో ఉన్నారని, ఇది తప్పుడు కేసు అని చెప్పటానికి, ఇదే కారణం అని అన్నారు. అయితే దేవినేని ఉమాకి బెయిల్ ఇవ్వటానికి వీలు లేదని, ఉమాని పోలీస్ కస్టడీకి అడిగారని, ఇంకా కొంత మంది పరారీలో ఉన్నారని కోర్టుకు చెప్పారు. దీంతో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు బెయిల్ ఇచ్చింది. పూర్తి ఆర్డర్ కాపీ వచ్చిన తరువాత, షరతులు ఏమిటి అనేవి, అలాగే కోర్టు అబ్జర్వేషన్స్ తెలిసే అవకాసం ఉంది. దేవినేని ఉమా ఈ రోజు సాయంత్రం విడుదల అయ్యే అవకాసం ఉంది.