హైటెక్ సిటీ నిర్మాణం జరిగి 23 సంవత్సరాలు పూర్తయిందని, ఆ నిర్మాణం ప్రపంచముఖచిత్రానికే తలమానికమని, అలాంటి నిర్మాణం చరిత్రపుటలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశమని, భవిష్యత్ లో ఐటీకి (ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ) డిమాండ్ వస్తుందని ముందే ఊహించిన చంద్రబాబునాయుడు, తనదార్శనికత, దూరదృష్టికి ప్రతిరూపంగా సదరు హైటెక్ సిటీ నిర్మాణం చేయడం జరిగిందని, టీడీపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలి మాజీఛైర్మన్ ఎమ్.ఏ.షరీఫ్ వ్యాఖ్యా నించారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విద్యారంగంలో సమూలమార్పులకు శ్రీకారంచుట్టిన చంద్రబాబునాయుడు, భవిష్యత్ లో ఐటీరంగానికి ఉండే గుర్తింపును ముందుగానే పసిగట్టారు. అప్పట్లో రాష్ట్రంలో కేవలం 30 ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రమే ఉండేవి, వాటిని 400లకు పెంచారు. మండలానికొక కళాశాలవంతున పెట్టారని, వాటిలో చదివేవారికి ఉద్యోగాలు ఎక్కడినుంచి వస్తాయని చాలామంది అప్పట్లో విమర్శలు చేశారు. భవిష్యత్ ను దృష్టిలోపెట్టుకున్న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ రంగాన్ని ప్రోత్సహించడానికి, యువతను ఆదిశగా అడుగులు వేసేలా చేయడానికి ఎంతగానో కృషిచేశారు. అమెరికాసహా, అనేకదేశాల్లో అప్పటికే నెలకొన్న ఐటీపరిశ్రమలతో సంప్రదింపులుజరిపి, ఆయా సంస్థలవారిని హైదరబాద్ కు ఆహ్వానించిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుంది. ఐటీ విద్యాభ్యాసం చదివిన యువత, ఏపీలో ఉన్నారని, వారందరూ తమతెలివితేటలు, మేథస్సుని మీ సంస్థలకోసం వినియోగిస్తారని చెప్పి, ప్రపంచఖ్యాతిపొందిన ఐటీసంస్థల యాజమాన్యాలను చంద్రబాబునాయుడు గారు ఒప్పించి, మెప్పించడం జరిగింది. ఆనాడు ఆయన ఎవరినైతే అభ్యర్థించారో, వారందరూ రాష్ట్రానికి వచ్చి, వారి సంస్థలతరుపున కార్యాలయాలు ప్రారంభించి, కార్యకలాపాలు కొనసాగించడంకోసం ఆనాడు హైదరాబాద్ లోని మాదాపూర్ లో చంద్ర బాబునాయుడు హైటెక్ సిటీ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. ఆనాడు ఆయన నాటిన విత్తనమే నేడు మహావృక్షమైంది. నేడు తెలంగాణకు హైటెక్ సిటీ ఒక తలమానికంలా నిలిచింది. ట్విన్ సిటీస్ గా పేరుపొందిన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలు, ట్రై సిటీస్ గా పేరు పొందేలా (హైటెక్ సిటీతో కలిపి) చేసిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కుతుంది. సదరు హైటెక్ సిటీనే నేడు ప్రత్యక్షంగా, పరోక్షంలా లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తోంది. నేడున్న తెలంగాణ రాష్ట్రం ధనికరాష్ట్రంగా చలామణీ అవుతోం దంటే అందుకు కారణం హైటెక్ సిటీ ప్రాంగణంలోని కంపెనీలు, సంస్థల నుంచి వచ్చే ఆదాయమే. రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్నఆదాయంలో 60శాతానికి పైగా హైటెక్ సిటీ ద్వారానే వస్తోందంటే అందుకు ప్రధాన కారణం చంద్రబాబునాయుడు దీక్షాదక్షతలే. హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపువచ్చిందంటే అందుకు కారణం హైటెక్ సిటీ నిర్మాణమే.

అలాంటి నిర్మాణం చేసిన తన అనుభవం, ఆలోచనలతోనే విడిపోయిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబునాయుడు ఎంపికచేశారు. అందరికీ, అన్నిప్రాంతాలకి ఆమోద యోగ్యంగా ఉండేలా అమరావతి నిర్మాణానికి అంకురార్పణ చేశారు. దిగ్గజఐటీ పరిశ్రమల నెలవైన హైటెక్స్ మాదిరే, అమరావతిని మార్చాలని, కనీసం 30లక్షలమందికి ఉద్యోగాలు వచ్చేలా నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆలోచనచేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగానే స్థానిక రైతుల 34వేలఎకరాలభూమిని రాజధానికోసం ఇచ్చేశారు. పైసా ఖర్చులేకుండా,భూములిచ్చిన వారిని అభివృద్ధిలో భాగ స్వాములను చేశారు ఏపీ మాజీ ముఖ్యమంత్రి. శాసనమండలి, అసెంబ్లీ, హైకోర్ట్ , సచివాలయం వంటి నిర్మాణాలు పోగా, మిగిలిన రూ.2లక్షలకోట్ల విలుమైన భూమిని అమరావతి అభివృద్ధికోసం కూడబెట్టాలని చంద్రబాబునాయుడు తలంచారు. ప్రజలుఏదైతే ఆశించారో, ఏ రాజధాని అయితే తమకు అందుబాటులోకి వస్తుందని భావించారో, దాన్ని నేడున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రజల ఆకాంక్షలు, ఉపాధిఅవకాశాలకు గొడ్డలి పెట్టులాంటి నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది. తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది. యువతలో నిరాశానిస్పృహలు పెరిగాయి. హైదరా బాద్, చెన్నై, బెంగుళూరుకు ధీటుగా అమరావతి నిర్మాణం ఉండాలని చంద్రబాబు ఆలోచించారు. ఆ ఆలోచనలకు అనుగుణంగానే ఆయన అమరావతి నిర్మాణదిశగా పురోగమించారు. కానీ ఈ ప్రభుత్వం మూడు రాజధానులంటూ రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసింది. పాలకులుచర్య ముమ్మాటికీ ప్రజలను, రాష్ట్రాన్ని అగౌరవపరచడమే. రాజధాని లేకపోవ డం వల్ల యువతఆలోచనలకు విఘాతం కలిగింది. ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడం వల్ల, అనేక కుటుంబాలు ఉపాధి కోల్పోయా యి. మద్యం దుకాణాల నిర్వహణ ఎంతవరకు సబబో పాలకులు ఆలో చించాలి. ప్రభుత్వం ఉంది వ్యాపారాలు చేయడానికి కాదు. కొత్తగా మాంసం వ్యాపారం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందంటున్నారు. అదేగానీ జరిగితే ఇప్పటికే మాంసం అమ్ముకుంటూజీవనం సాగిస్తున్న లక్షలాదిమంది రోడ్డునపడే ప్రమాదముంది. జీవో 217 ద్వారా మత్స్యకారులకు ఉపాధికల్పిస్తున్న గ్రామాల్లోని చెరువులు, కుంటలను గ్రామపంచాయతీలకు అప్పచెప్పడానికి సిద్ధమైంది. అది ఎంతమాత్రం సబబుకాదని స్పష్టంచేస్తున్నాం, ప్రభుత్వం అంటే యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేదిగా ఉండాలి గానీ, ఉన్నఉపాధిని పోగోట్టకూ డదని స్పష్టంచేస్తున్నాం. హైటెక్ సిటీ నిర్మాణం , తద్వారా ఉమ్మడి , మరియు తెలంగాణ రాష్ట్రానికి ఒనగూరుతున్న ప్రయోజనాలను ప్రజలు గమనించి, భవిష్యత్ లో రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసు కోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తిచేస్తున్నాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read