మాజీ మంత్రి, జగన్ మోహన్ రెడ్డి బాబాయ్, అయిన వైఎస్ వివేక కేసు ఇంకా ఇంకా సాగుతూనే ఉంది. 107వ రోజు వరుసుగా సీబీఐ విచారణ చేస్తుంది. కడప కేంద్ర కారాగారం అతిధిగృహంలో సీబీఐ విచారణ చ్జేస్తిమ్దో. ఇప్పటికే వివేకా హత్యకేసులో ఉమాశంకర్ రెడ్డికి కస్టడీ ముగియటంతో, పులివెందుల కోర్టులో సీబీఐ హాజరు పరిచింది. ఉమాశంకర్‍రెడ్డిని నాలుగు రోజులపాటు కస్టడీలో విచారించిన సీబీఐ, ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే కడప జమాలపల్లి వాసి విజయశంకర్ రెడ్డి కూడా సిబిఐ విచారణకు హాజరు అయ్యారు. వాహనాలు, ఆయుధాలు, ఇలా రకరకాల విషయాల్లో సిబిఐ క్లారిటీ తెచ్చుకుంటుంది. అయితే ఇది ఇలా ఉంటే నిన్న సిబిఐ ఒక ట్విస్ట్ ఇచ్చింది. కొంత మంది టీవీ చానల్స్ వారికి నోటీసులు ఇచ్చి, వారిని విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ఇదేదో మొదటిగా గుండె పోటు అని చెప్పిన ఛానల్ ను విచారణకే పిలిచారేమో అని అందరూ అనుకున్నారు. అక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. సిబిఐ నోటీసులు ఇచ్చింది, వివేక వాచ్ మెన్ రంగన్న వాంగ్మూలం అంటూ, కొన్ని టీవీ చానల్స్ ప్రచారం చేయటం, రంగన్న ను ఇంటర్వ్యూ తీసుకున్నారనే కోణంలో, సిబిఐ అధికారులు ఆ మీడియా ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారట.

viveka 22092021 2

రంగన్న ఇచ్చిన వాంగ్మూలం కోర్టుల జడ్జి ముందు ఇస్తే, అది ఎవరికీ బయటకు తెలిసే అవకాసం లేదని, రంగన్న ఇద్దరు పేర్లు చెప్పారు అంటూ మీడియాలో కధనాలు వచ్చాయని, ఆ ఇద్దరి పేర్లు మీడియాకు ఎలా తెలుసు అనే కోణంలో సిబిఐ విచారణ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ విషయం పైనే మీడియా ప్రతినిధులకు నోటీసులు జారీ చేసి, వారిని విచారణకు పిలిచారు. ఈ రోజు మీడియా ప్రతినిధులను విచారణ చేసినట్టు తెలుస్తుంది. అయితే, అసలు వివేక కేసులో కీలకమైన అంశాల పై కాకుండా, ఇలాంటి చిన్న చిన్న అంశాల పై సిబిఐ ఎక్కువ ఫోకస్ పెట్టటం వెనుక విమర్శలు వస్తున్నాయి. విచారణ మొదలైన ఇన్ని రోజులకు కూడా వైఎస్ సునీత అనుమానం వ్యక్తం చేసిన కొంత మంది కీలక వ్యక్తులను విచారణకు పిలవలేదు. సిబిఐ వారి విచారణలో వారి పేర్లు లేవు కాబట్టి ఇంకా విచారణకు పిలిచి ఉండరని అంటున్నారు. ఇప్పటికే సిబిఐ రివ్వార్డ్ కూడా ప్రకటించింది. అయినా ఈ కేసు మాత్రం తేలటం లేదు. అసలు ఈ కేసు ఎప్పటికి తేలుతుందో, అసలు దోషులు దొరుకుతారో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read