రస్ అల్ ఖైమా.. గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉండగా, ఈ పేరు మారుమొగి పోయింది. ఆయన చనిపోయిన తరువాత కూడా ఈ పేరు జగన్ అక్రమ ఆస్తుల కేసులో మారుమోగింది. ఏడాది క్రితం సెర్బియాలో, నిమ్మగడ్డ ప్రసద్ ని అరెస్ట్ చేసి, రస్ అల్ ఖైమా ఫిర్యాదుతోనే. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి మరీ అరెస్ట్ చేసారు. రస్ అల్ ఖైమా సంస్థ అప్పట్లో వాన్పిక్ పోర్ట్ నిర్మాణం, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే తరువాత ఇది పెద్ద స్కాం వైపుకు మళ్ళింది. రస్ అల్ ఖైమా డబ్బుతోనే, నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీలలో రూ.854కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. తరువాత ఈ స్కాం బయట పడటంతో, రస్ అల్ ఖైమా సీరియస్ అయ్యి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. తరువాత ఈ ప్రాజెక్ట్ పైన కూడా సిబిఐ ఒక చార్జ్ షీట్ వేసింది. ఇందులో కూడా జగన్ ఏ1, విజయసాయి రెడ్డి ఏ2. ఈ విషయం పక్కన పెడితే, రస్ అల్ ఖైమా కంపెనీ తాము పెట్టిన పెట్టుబడులు దారి మళ్ళించారని, ఆ డబ్బు ఇప్పించాలని గతంలోనే భారత ప్రభుత్వానికి లేఖ రాసారు. తరువాత, అంతర్జాతీయ న్యాయస్థానాలకు కూడా ఆశ్రయించారు. అయితే ఈ కేసులోనే నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్ అవ్వటం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు ఇంకా నానుతూనే ఉంది. అయితే ఇదే రస్ అల్ ఖైమాతో గతంలో మరో ఒప్పందం కూడా ఉంది.

rkc 22092021 2

రస్ అల్ ఖైమాకు బాక్సైట్ సరఫరా చేస్తామని గతంలో ఒప్పందం చేసుకున్నారు. దాని పై కూడా ఒప్పందం చేసుకున్నారు. తరువాత రాజశేఖర్ రెడ్డి చనిపోవటం, ప్రభుత్వాలు మారటం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తరువాత బాక్సైట్ తవ్వకాలు ఆపేయటంతో, రస్ అల్ ఖైమా ఇక్కడ కూడా నష్టపోయింది. అయితే రస్ అల్ ఖైమా ఈ విషయం పై కూడా సీరియస్ అయ్యి, తమకు నష్టపరిహారం ఇవ్వలని కోరుతున్నారు. దీని పై ఆర్బిట్రేషన్ కూడా కూడా వెళ్లారు. దీంతో రస్ అల్ ఖైమా వ్యవహారం తేల్చటానికి ,జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. రస్ అల్ ఖైమా సంస్థతో మాట్లాడటానికి, రాష్ట్రానికి చెందిన అధికారులను ద్వివేది నేతృత్వంలో అక్కడకు పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు బాక్సైట్ ఇవ్వటం కుదరదు, వాళ్ళు అడిగినట్టు నష్టపరిహారం ఇవ్వాలి అంటే, రూ.600 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలోనే కేంద్ర సాయం కూడా కోరారు. విశాఖలో రస్ అల్ ఖైమా ప్లాంట్ పెడతారని, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి బాక్సైట్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. మరి చివరకు ఏమి అవుతుందో చూడాలి. మొత్తానికి అప్పటి పాపాలు, ఇప్పటికీ రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read