టిటిడి ప్రత్యేక పాలక మండలి నియమకానికి సంబంధించి, జంబో బోర్డు నియామకం పై, హైకోర్టు సీరియస్ అయ్యింది. దీనికి సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 568, జీవో నెంబర్ 569, ఈ రెండు జీవోలను కూడా హైకోర్టు సస్పెండ్ చేస్తూ, సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రెండు జీవోలతో కలిసి మొత్తం 54 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు జీవోలను జారీ చేసింది. ఈ జీవోల పై హిందూ ధార్మిక సంస్థతో పాటు, కళ్యాణదుర్గానికి చెందిన టిడిపి ఇంచార్జ్, ఉమామహేశ్వర నాయుడు దాఖలు చేసిన పిటీషన్ పై, ఈ రోజు వాద ప్రతి వాదనలు జరిగాయి. హైకోర్టులో హిందూ దేవాలయాల ధార్మిక సంస్థ తరుపున, అదే విధంగా కళ్యాణదుర్గానికి చెందిన టిడిపి ఇంచార్జ్, ఉమామహేశ్వర నాయుడు తరుపున, యలమంజుల బాలజీ అలాగే మరి కొంత మంది న్యాయవాదులు వాదించారు. టిటిడి అనేది, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు సంబంధించిన పుణ్యక్షేత్రం అని, ఆ పుణ్యక్షేత్రంలో ఉన్న అన్ని ధర్మాలను, రూల్స్ ని ఉల్లంఘిస్తూ, పాలకమండలిని నియమించారని కూడా ఆక్షేపించారు. అదే విధంగా ఇటువంటి పాలకమండలి నియామకం టిటిడి చరిత్రలో ఇంత వరకు లేదని కూడా కోర్టుకు తెలిపారు.

hc 22092021 2

టిటిడి పాలకమండలిలో ఎవరు అయితే ప్రత్యేక ఆహ్వానీతులుగా నియమించారో, వారికి టిటిడి బోర్డు సభ్యులతో పాటుగా, వారికి అన్ని సౌకర్యాలు వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని, ఆ జీవోలోని అంశాలను న్యాయవాదులు హైకోర్టు ధర్మాసనం ముందు ఉంచారు. అయితే ఈ విషయాలు తెలుసుకున్న ధర్మాసనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ రెండు జీవోలు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా హిందూ ధార్మిక సంస్థ తరుపున దఖులైన పిటీషన్ లో కూడా, ఆంధ్రప్రదేశ్ లో 1987లో ఉన్న హిందూ దేవాదాయ ధార్మిక చట్టంలోని సెక్షన్లకు ఇది పూర్తిగా విరుద్ధం అని పేర్కొన్నారు. ఆ చట్టంలో పొందుపారించిన నిబంధనలు కూడా ఉదాహరించారు. ఇక దీంతో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 25కి కూడా ఇది పూర్తిగా విరుద్ధం అని కూడా చెప్పారు. ఈ నేపధ్యంలోనే జంబో బోర్డు కేంద్ర మంత్రి పదవుల కంటే ఎక్కవ ఉందని వాదనతో ఏకీభావంచిన హైకోర్టు, ఈ జీవోలను సస్పెండ్ చేస్తూ, నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read