జోగి రమేష్ కొంత మంది గూండాలను వేసుకుని వచ్చి, చంద్రబాబు ఇంటి పైనే దా-డి చేసిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఇప్పటికే టిడిపి నేతల పైన నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, వైసీపీ నేతల పైన బెయిలబుల్ కేసులు పెట్టారు. అలాగే డిఐజి ఎస్పీలు కూడా, మీడియా సమావేశం పెట్టి, జోగి రమేష్ తప్పు ఏమి లేదని, మొత్తం టిడిపి నేతలదే తప్పు అని, జోగి రమేష్ కేవలం చంద్రబాబుతో మాట్లాడటానికి వెళ్ళారని చెప్పారు. అయితే దీని పై టిడిపి నేతలు షాక్ తిన్నారు.న్యాయస్థానంలోనే తేల్చుకోవాలని హైకోర్టు మెట్లు ఎక్కారు. తమ పై ఆధారాలు లేకుండా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కోర్టు ముందు వాదనలు వినిపించారు. దీని పై ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు, టిడిపి నేతలకు ఊరటను ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చింది. చంద్రబాబు నివాసం పై జోగి రమేష్, అతని మనుషులు దా-డి చేస్తే, చంద్రబాబు నివాసం పై ఎస్సీ, ఎస్టీ చట్టంతో, పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అదే విధంగా కారు అద్దాలు ధ్వం-సం చేసి, విధులకు ఆటంకం కలిగించారని చెప్పి, తెలుగుదేశం నేత నాదెండ్ల బ్రహ్మం పై కూడా కేసులు నమోదు చేసారు. అయితే ఈ కేసులు కొట్టి వేయాలని, చంద్రబాబు నివాసం వద్దకు వారే వచ్చి, వారని అడ్డుకుంటే, తమ పైనే కేసులు మోపారని, కోర్టుని ఆశ్రయించారు.
ఈ రోజు కోర్టులో, ఈ రెండు పిటీషన్లు కూడా విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతల తరుపున, న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఈ సెక్షన్లు అన్నీ కుద ఏడేళ్ళ లోపు శిక్షలు కావటంతో, వీరి అందరికీ కూడా సీఆర్పీసీ 41 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి, వారిని విచారణకు పిలిచి పంపించి వేయాలని వాదనలు వినిపించారు. అదే విధంగా ఈ కేసుకు సంబంధించి, టిడిపి నేతలను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రొసీజర్ ఫాలో కాకుండా, ఇలా చేయటం చట్ట విరుద్ధమని వాదించారు. ఈ నేపధ్యంలోనే హైకోర్టు, వీరి అందరికీ సిఆర్పీసీ 41 సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రొసీజర్ ప్రకారమే వెళ్లాలని, తాదేపల్లి పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఏడేళ్ళ లోపు శిక్ష పడే కేసులు, ముందుగా 41 సెక్షన్ కింద విచారణ చేసి, పంపించి వేయాలని, వీరిని అరెస్ట్ చేసే హక్కు కూడా లేదని టిడిపి వర్గాలు కోర్టు ముందు వాదించాయి. మొత్తానికి టిడిపి నేతల పైనే ఎదురు కేసు పెట్టిన పోలీసులకు చిక్కు ఎదురు అయ్యింది.