ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టుల్లో మొట్టికాయలు సర్వ సాధారణం అయిపోయాయి. ప్రతి రోజు కోర్టులు మొట్టికాయలు వేయటం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కూడా అలవాటు అయిపొయింది. గత ప్రభుత్వాలు, కోర్టుల్లో ఏమైనా రిమార్క్స్ వస్తే అవమానంగా భావించే, అవి మళ్ళీ జరగకుండా కరెక్ట్ చేసుకునే వారు. ఇప్పటి ప్రభుత్వం మాత్రం చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ, కోర్టుల చేత మొట్టికాయలు తింటుంది. తాజాగా జరిగిన ఒక కేసులో, ఏపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది సుప్రీం కోర్టు. ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించారు. ఒక ప్రభుత్వానికి, సుప్రీం కోర్టులో ఇలా జరిమానా పడటం అరుదు అనే చెప్పాలి. ఇక కేసు విషయానికి వస్తే, గతంలో ఒక కేసు విషయంలో, హైకోర్టులో ఉమ్మడి అంగీకారంతో తీర్పు ఇవ్వగా, ఆ తీర్పుని పట్టుకుని, సుప్రీం కోర్టుకు ఏపి ప్రభుత్వం వెళ్ళటం పై, సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక పక్క హైకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు పరచకుండా, ఆలస్యం చేయటం , మరో పక్క ఉమ్మడి అంగీకారంతో హైకోర్టు ఇచ్చిన తీర్పుని, మళ్ళీ అపీల్ పేరుతో సుప్రీం కోర్టుకు రావటం, అనవసరంగా సుప్రీం కోర్టు సమయాన్ని వృధా చేయటం పై, సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు ప్రభుత్వానికి లక్ష జరిమానా విధించింది.

sc 24092021 2

ఏవో పార్టీలు ఇలా కోర్టు సమయాన్ని వృధా చేసాయి అంటే అనుకోవచ్చు, ఇక్కడ ఏకంగా ప్రభుత్వమే ఇలా చేయటం పై, పలువురు ఆశ్చర్య పోయారు. ఈ మేరకు సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం, ఏపి ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీర్పు ఇచ్చింది. దేవీసీఫుడ్స్‌ అనే సంస్థ సర్ఫేసీ యాక్ట్‌ కింద, కొన్ని బ్యాంకులు కొన్ని స్థలాలను వేలం వేయగా, వాటి ఆస్తులు కొనుగోలు చేసింది. అయితే రిజిస్టర్ వేల్యూ కాకుండా, మార్కెట్ ధర ప్రకారం చెల్లింపులు చేయాలని ప్రభుత్వం మెలిక పెట్టింది. తరువాత ఇది సింగల్ బెంచ్ కు వెళ్ళటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావటం, తరువాత మళ్ళీ డివిజినల్ బెంచ్ కు వెళ్ళటం, అక్కడ కూడా ప్రభుత్వ పిటీషన్ ను డిస్మిస్ చేసారు. అయితే గతంలోనే దీని పై స్పష్టత ఉండటం, ప్రభుత్వ సమ్మత ఉండటం, ఇప్పుడు మళ్ళీ ఇదే విషయం పై సుప్రీం కోర్టుకు ప్రభుత్వం వెళ్ళటంతో, సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు, లక్ష రూపాయల జరిమానాను, ఏపి ప్రభుత్వానికి విధించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read