మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి పై శుక్రవారం నాడు, జోగి రమేష్ ఆధ్వర్యంలో దాదాపుగా 30 వరకు వాహనాలతో, 100 మందికి పైగా వెళ్లి, కర్రలు, రాడ్డులు, రాళ్ళతో, దండయాత్ర చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే రివర్స్ లో టిడిపి నేతల పై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, వైసీపీ నేతల పై బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇది ఒక షాక్ అయితే, డీజీపీ ఆఫీస్ కు వెళ్ళిన టిడిపి నేతలు, ముద్దాయి జోగి రమేష్ అని సంబోధిస్తుంటే, ఎవరు ముద్దాయిలు, మీరెవరు ముద్దాయిలు అని చెప్పటానికి అంటూ, ఎస్పీ అమ్మిరెడ్డి ఊగిపోయారు. ఆయన ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యారో అర్ధం కాలేదు. అయితే ఈ రోజు గుంటూరు జిల్లా ఐజి, అర్బన్, రూరల్ ఎస్పీలు పెట్టిన ప్రెస్ విని టిడిపి నేతలు షాక్ అయ్యారు. గుంటూరు రేంజ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ మాట్లాడుతూ, తమకు అసలు జోగి రమేష్, చంద్రబాబు ఇంటికి వస్తారనే సమాచారం లేదని అన్నారు. ఒక పక్క జోగి రమేష్ ముందు రోజు వార్నింగ్ ఇచ్చినా, ఐజి ఇలా చెప్పటం ఆశ్చర్యానికి గురి చేసిందని టిడిపి నేతలు అంటున్నారు. అయితే టిడిపి నేతలకు మాత్రం ముందుగా సమాచారం ఉందని, అందుకే ముందుగానే టిడిపి శ్రేణులు అక్కడ గుమికూడి, జోగి రమేష్ తో పాటుగా, ఆయన అనుచరులు పైన కూడా దా-డి చేసారని అన్నారు.
అయితే మీడియాలో మాత్రం జోగి రమేష్, చంద్రబాబు ఇంటి పై దాడి చేసారని కధనాలు వచ్చాయని, అవి తప్పు అని ఐజి అన్నారు. మీడియా తప్పుడు కధనాలు ప్రచురించిందని, జోగి రమేష్ పైనే దా-డి జరిగిందని అన్నారు. జోగి రమేష్ డ్రైవర్ ని కూడా కొట్టారని అన్నారు. అలాగే డీజీపీ ఆఫీస్ దగ్గరకు అచ్చి హడావిడి చేసారని అన్నారు. జోగి రమేష్ కేవలం చంద్రబాబుతో మాట్లాడటానికి వెళ్ళారని, ఆయన అటాక్ చేసే ఉద్దేశం లేదని ఐజి అన్నారు. ఇదే వర్జ్షన్ ని, గుంటూరు అర్బన్ ఎస్పీతో పాటు, రూరల్ ఎస్పీ కూడా చెప్పారు. అసలు జోగి రమేష్ కి ఏ పాపం తెలియదని, మొత్తం టిడిపి నేతలనే తప్పని తేల్చేసారు. అంతే కాదు, మీడియా తప్పుడు కధనాలు ప్రచురించిందని అన్నారు. అయితే ఆ రోజు సిసి టీవీ ఫూటేజ్, వీడియోలు చూసిన వారు, ఇదేమిటి అంటూ షాక్ తిన్నారు. నిజంగా ఏపి పోలీస్ కు హాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఇక టిడిపి నేతలు అయితే, ఇక మాట్లాడటానికి ఏమి లేదని, పోలీసులు ఇలా ఉండటం ఆశ్చర్యానికి గురి అవుతున్నమాని అన్నారు.