గత నాలుగు రోజలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హెరాయిన్ కేసు కుదిపేస్తుంది. తాలిబన్ల నుంచి వచ్చిన హెరాయిన్ ని గుజరాత్ పోర్టులో పట్టుకున్నారు. అయితే అది విజయవాడకు చెందిన కన్జైంట్మెంట్ కావటంతో, ఒక్కసారిగా ఏపి ఉలిక్కి పడింది. దీంతో సహజంగానే రాజకీయ విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో అధికార పార్టీ వ్యవహరించిన తీరు పై టిడిపి ప్రశ్నించింది. అయితే దీని పై క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన ప్రభుత్వం మాత్రం, ఎదురు దాడికి దిగింది. మంత్రి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి, ఇదంతా అబద్ధం అని, అసలు ఈ అలవాటు టిడిపి వారికే ఉందని పెద్ద లిస్టు చదివారు. అందులో హెరిటేజ్ వ్యానుల్లో జపాన్ కు ఎర్రచందనం తీసుకుని వెళ్లారు అంటూ విమర్శలు చేసారు. హెరిటేజ్ వ్యానుల్లో ఎర్ర చందనం తీసుకుని జపాన్ వెళ్ళటం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. దీని పై సోషల్ మీడియాలో కూడా ట్రాలింగ్ జరిగింది. ఇది ఇలా ఉంటే హెరిటేజ్ లాంటి లిస్టెడ్ కంపెనీ పై మంత్రి ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయటంతో, ఇన్వెస్టర్స్ ఒత్తిడితో, మంత్రి పై హెరిటేజ్ సంస్థ సీరియస్ అయ్యింది. ఆ సంస్థకు చెందిన ప్రెసిడెంట్, సాంబశివ రావు, మంత్రి నానికి లీగల్ నోటీస్ పంపించారు. సెప్టెంబర్ 22 న మంత్రి పేర్ని నాని, తమ సంస్థ పై చేసిన విమర్సలకు సమాధానం చెప్తున్నాం అంటూ ప్రకటన విడుదల చేసారు.
హెరిటేజ్ వ్యానుల్లో ఎర్రచందనం తరలిస్తున్నారు అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చూసామని, ఇది తప్పుడు ప్రకటన అని అన్నారు. గతంలో 2017లో సాక్షి పత్రికలో తప్పుడు వార్త ప్రకటించారని, దీని పై ఆ రోజే తాము ఖండించామని, తమ ఖండన అన్ని పత్రికల్లో వచ్చింది కానీ, సాక్షిలో రాలేదని అన్నారు. దేని పై అప్పుడే సాక్షికి లీగల్ నోటీస్ కూడా పంపించామని అన్నరు. ఆ కేసులో హెరిటేజ్ పేరుని వాడుకుని, గంగిరెడ్డి ముఖ్య అనుచురడు ఇది చేసినట్టు అప్పుడే పత్రికల్లో కూడా వచ్చింది. అయితే ఇప్పటికె సాక్షి ఆరోపణల పై వేసిన కేసు పెండింగ్ లో ఉందని, మంత్రి మళ్ళీ అవే ఆరోపణలు చేసారని, ఏడు రోజుల్లో మీరు చేసిన ఆరోపణలు వెనక్కు తీసుకోవాలని, వెనక్కు తీసుకోక పోతే మీ మీద కూడా కేసు వేస్తాం అంటూ హెరిటేజ్ సంస్థ తమ నోటీసులో మంత్రికి తెలిపింది. ఇలాంటి రాజకీయ అంశాల్లోకి, వేల మంది ఉద్యోగులు, ఇన్వెస్టర్లు నమ్మకాన్ని పోగేట్టేలా, రాజకీయ విమర్శలు చేయటం హేయం అంటూ, హెరిటేజ్ పేర్కొంది.