జగన్ మోహన్ రెడ్డి చెల్లి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్టిపి పేరిట, ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా, మొన్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ఊరు ఊరు తిరిగి, జగన్ మోహన్ రెడ్డిని గెలిపించమని కోరారు. ఏమైందో ఏమో కానీ, జగన్ మోహన్ రెడ్డి గెలిచిన తరువాత, షర్మిలను దూరం పెట్టారనే ప్రచారం ఉంది. రోజులు గడిచే కొద్దీ ఇద్దరికీ గ్యాప్ పెరిగింది. తల్లి విజయలక్ష్మి కూడా షర్మిల వైపే ఉన్నారు. షర్మిల సభల్లో కూడా పాల్గుంటున్నారు. అయితే విజయమ్మ ఒక ఒక్క జగన్ పార్టీకి అధ్యక్షురాలు హోదాలో ఉండి, మరో పార్టీ సభల్లో పాల్గునటం పై కూడా విమర్శలు వస్తున్నాయి. షర్మిలకు, జగన్ కు మధ్య ఏమి లేదని, అంతా బాగానే ఉందని, ఇదంతా రాజకీయ లబ్ది కోసం ఆడే నాటకం అని అనే వారు ఉన్నారు. షర్మిలకు జగన్ పై కోపం ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టాలి కానీ, తెలంగాణలో ఎందుకు పెడుతుంది అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే బయటకు మాత్రం, ఇద్దరి మధ్య తేడా కొట్టినట్టే తెలుస్తుంది. పార్టీ పెట్టిన కొత్తలో, జగన్ గురించి అడగగా, అదే ఆయన్నే అడగండి అంటూ షర్మిల సమాధానం చెప్పారు. అలాగే సజ్జల కూడా, తాము పార్టీ పెట్ట వద్దు అని చెప్పినా, ఆమె పార్టీ పెట్టారని, తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని అన్నారు.
అలాగే షర్మిల సభలో, సాక్షి పై బహిరంగంగానే విమర్శలు చేసారు. సాక్షి తమకు కవరేజ్ ఇవ్వదు కదా పక్కకు తప్పుకోండి అని బహిరంగంగా చెప్పటం సంచలనం అయ్యింది. వైఎస్ఆర్ వర్ధంతి , జయంతి రోజున కానీ, జగన్, షర్మిల మాట్లాడుకోలేదు. వైఎస్ఆర్ సంస్మరణ సభకు కూడా జగన్ వెళ్ళలేదు. ఇప్పటి వరకు షర్మిలకు జగన్ ఎలాంటి సహాయం రాజకీయం అందించలేదు. ఈ తరుణంలోనే షర్మిల తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూ లో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సాక్షిని తెలంగాణలో మీరు టెక్ అప్ చేస్తారా అని అడగగా, టెక్ అప్ ఏంటి, నేను కూడా సాక్షిలో ఒక ఓనర్ ని అంటూ షర్మిల సమాధానం చెప్పారు. అంటే ఆమె సాక్షిని తెలంగాణలో టెక్ అప్ చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. అంటే సాక్షి మీడియా, పేపర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేతిలో, తెలంగాణాలో షర్మిల చేతిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాక్షి రెండుగా చీలిపోతుందా ? లేదా ఒకే మ్యానేజ్మెంట్ లో ఇద్దరూ పని చేస్తారా అనేది భవిష్యత్తులో తెలుస్తుంది.