మొన్నటి దాకా రిజిస్టర్ ఆఫీసుల్లో నకిలీ బిల్లులు స్కాంతో ఏపి మొత్తం సెన్సేషన్ అయ్యింది. అయితే కేవలం అధికారుల మాత్రమే ఇంత పెద్ద స్కాంకి బాధ్యులు అంటూ, కొంత మందిని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. అయితే ఎవరికీ శిక్షలు పడినట్టు, అయితే వార్తలు రాలేదు. ఆ డబ్బు రికవరీ పూర్తిగా అయ్యిందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే ప్రజలు ఇది మరచిపోతున్న సమయంలో, ఇప్పుడు ఏపి సచివాలయంలో మరో భారీ స్కాం బయట పడింది. సియం రిలీఫ్ ఫండ్ కు సంబంధించి, భారీ స్కాం జరిగినట్టు తేలింది. ఏసిబి అధికారులు రంగంలోకి దిగారు. ఏపి సచివాలయంలో పని చేసే కొంత మంది ఉద్యోగులే ఈ భారీ స్కాంకి పాల్పడినట్టు గురించారు. కొంత మంది ఉద్యోగులు పాత్ర ఇందులో ఉందని ఏసిబి చెప్తుంది. పేదలకు అందాల్సిన ఈ సొమ్ముని, సచివాలయంలో ఉండే కొంత మంది ఉద్యోగులు నొక్కేసినట్టు అంచనాకు వచ్చారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే, కొంత మంది ప్రజా ప్రతినిధుల పిఏలు కూడా ఇందులో ఉన్నారని, అలాగే కొంత మంది ప్రజా ప్రతినిధుల అనుచరులు కూడా ఇందులో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఏసిబి అధికారులు మాత్రం ఇందుకు సంబంధించి ఏమి వివరాలు అయిఅతే బయటకు చెప్పలేదు.

sec 22092021 2

ఆరు నెలలు క్రితం కూడా ఈ స్కాం బయటకు వచ్చింది. అప్పట్లో అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే గురించి వార్తలు వచ్చినా, ఆయన ఖండించారు. ఈ రోజు కొంత మంది ఉద్యోగులను ఏసిబి అదుపులోకి తీసుకుంది. నకిలీ బిల్లులు తాయారు చేసి, సియం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు మంజూరు చేసినట్టు తేల్చారు. ఈ విచారణలో భాగంగానే, కొంత మందిని విచారణ చేసిన ఏసిబి, వారిలో కొంత మందిని అదుపులోకి తీసుకునట్టు ప్రచారం జరుగుతుంది. పేదల ఆధార్ కార్డు ఇతర వివరాలు తీసుకుని, వారికి తెలియకుండానే, నకిలీ బిల్లులు సృష్టించి, సియం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు కాజేసారు. దాదాపుగా వంద కోట్లకు పైగానే ఇలా కొట్టేసినట్టు తెలుస్తుంది. అయితే కేవలం ఉద్యోగులు మాత్రమే ఇంత ధైర్యంగా స్కాం చేస్తారా అంటే, అనుమానం రాక మానదు. దీని వెనుక కొంత మంది పెద్ద తలకాయలు ఉంటారని, వారిని పట్టుకోవాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి అసలు స్కాం చేసిన సూత్రధారులు బయటకు వస్తారో రారో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read