జగన్ ముఖ్యమంత్రయ్యాక ఆంధ్రప్రదేశ్ అరాచాకాంధ్రప్రదేశ్ గా మారిందని, వైసీపీ నేతల వ్యవహారశైలితో విదేశాల్లో సైతం మన రాష్ట్ర ప్రతిష్టదిగజారుతోందని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ద్వజమెత్తారు. శనివారం నాడు టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో ఆషే ట్రేడింగ్ అనే కంపెనీ పేరుతో అక్రమంగా రవాణా అవుతున్న రూ. 72 వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ లో పట్టుబడితే దానిపై కనీసం విచారణ జరపకుండా దీంతో రాష్ట్రానికి సంబందం లేదని, దీనిపై ప్రతిపక్షాలు వక్రీకరించి పోలీసులు మాట్లాడటం బాధాకరం. ఏపీలో ఉన్న కంపెనీ పేరుతో డ్రగ్స్ రవాణా అవుతోందని జాతీయ మీడియా సైతం కోడైకూస్తోంది. వైసీపీ నేతలు రాష్ట్ర పరువు, ప్రతిష్ట దిగజార్చుతుంటే ప్రతిపక్షంగా మాట్లాడే బాధ్యత మాకు లేదా? ఇంత పెద్దమెత్తంలో డ్ర-గ్స్ పట్టుబడితే డీజీపీ బాద్యత లేకుండా ప్రభుత్వాన్ని కాపాడేందుకు దీనితో రాష్ట్రానికి సంబందం లేదని మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దీనిపై ప్రతిపక్ష నేతలు వక్రీకరించి మాట్లాడుతున్నారని డీజీపీ అనటం సరికాదు. వైసీపీ మాదిరి ఆదారాలు లేకుండా ఎదుటి వారిపై బురదచల్లే అలవాటుకు టీడీపీకి లేదు. గతంలో పింక్ డైమండ్ పై అసత్య ప్రచారం చేసింది ఎవరు? మేం ఆదారాలు లేకుండా ఏదీ మాట్లాడం. ఆధారాలుంటేనే మేం మాట్లాడుతాం తప్ప గాలి కబుర్లు చెప్పం. ఆషీ ట్రేడింగ్ అనే కంపెనీ చిరునామా మాత్రమే రాష్ర్టంలో ఉందని దాని కార్యకలాపాలు ఇక్కడ లేవని డీజీపీ చెప్పారు. కానీ ఆ కంపెనీ పేరుతో ఉన్న జీఎస్టీ వివరాలు చూస్తే గత 9 నెలలుగా జీఎస్టీ చెల్లిస్తున్నట్టుగా ఉంది,దీనికి డీజీపీ సమాధానం చెబుతారు? ముఖ్యమంత్రి ఇంటి పక్కనే పెద్ద మెత్తంలో డ్ర-గ్స్ వ్యాపారం నడుస్తుంటే దాని గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? దీనిపై కనీస విచారణ చేయకుండా ఎలాంటి ఆదారాలు లేకుండా పోలీసులు వాస్తవాలు వక్రీకరించి ఎందుకు మాట్లాడుతున్నారు?
దీనిపై రాష్ర్ట పోలీసు వ్యవస్ధ విచారణ చేయాల్సిన అవసరం లేదా? రాష్ర్టాన్ని, ప్రజలను రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత. కానీ డీజీపీ మాత్రం ప్రభుత్వంపై వచ్చే ఆరోపణల్లో జగన్ ని రక్షించేందుకు పనిచేస్తున్నారు. దీనిపై డీఆర్ఐ.విచారణ చేస్తే...రాష్ట్ర పోలీసులు ఏం చేస్తారు? విజయవాడలో కంపెనీ ఉన్నపుడు మీ బాధ్యతగా కనీస విచారణ చేయరా? డ్ర-గ్స్ ని ప్రోత్సహించటం అంటే జాతిని నిర్వీర్యం చేయటమే... తాలిబన్లతో సంబందాలు పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. టీడీపీ హయంలో అభివృద్ది, సంక్షేమానికి చిరునామాగా ఉన్న రాష్ట్రం నేడు మాఫియాకు నిలయంగా మారింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో లిక్కర్, డ్ర-గ్, హ-వా-లా మాపియా నడుస్తోంది. తిరుపతి శ్రీ వారి తలనీలాలు తరలిస్తుంటే..మయున్మార్ లో పట్టుకున్నారు, వైసీపీ మంత్రి తన అనుచరులతో హ-వా-లా డబ్బు తరలిస్తూ చైన్నైలో పట్టుబడ్డారు. టీడీపీ హయాంలో రాష్ట్రానికి రూ. 5 వేల కోట్లకుపైగా పెట్టుబడులు తెచ్చి కియా వంటి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాం, కానీ జగన్ రెడ్డి పాలనలో రూ. 72 వేల కోట్ల పెట్టుబడితో హెరాయిన్ రాష్ర్టానికి వచ్చింది. ఈ కంపెనీ పేరుతో ఇప్పటివరకు రూ.1.96 లక్షల కోట్ల హెరాయిన్ పట్టుబడ్డ వార్తలొస్తున్నాయి.దీనిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదు? ప్రజలు ఏమనుకోవాలి. జగనే దీన్ని చేయిస్తున్నారనుకోవాలా లేక ఆయన చేతకాని తనం అనుకోవాలా? ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
ఆషీ ట్రేడింగ్ కంపెనీ వెనకున్న..వారిపై చర్యలు తీసుకాలి. పట్టుబడ్డ వ్యక్తి సుధాకర్ కి, వైసీపీ నేతలకు సంబందాలున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు ఆ దిశగా విచారణ చేశారా? దీనిపై విచరాణ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఈవే బిల్సు ఎందుకు బయటపెట్టడం లేదు? పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండా స్టేమ్ మెంట్ ఇచ్చి మమ్మల్ని మాట్లాడొద్దంటే ఎలా? పోలీలసులు ప్రభుత్వానికి మద్దతుగా పలికి పోలిటికల్ వ్యవస్ధలా మారిపోయి మాట్లాడటం రాష్ట్రానికి మంచిది కాదు. అధికారులు జగన్ మాటలు విని రాష్ర్టానికి అన్యాయం చేయెద్దు..జగన్ గత చరిత్ర ఏంటో అధికారలు గమనించాలి. జగన్ , వైసీపీ నేతలు తమ బినామీలు, కుటుంబ సభ్యుల మద్యం కంపెనీల్లో మద్యం తయారు చేయిస్తూ పిచ్చిపిచ్చి బ్రాండ్లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మద్యపాన నిషేదం చేస్తానన్న జగన్ ఎందుకు ఆ హమీని నిలబెట్టుకోవటం లేదు. అక్రమ సంపాదన కోసం డిక్టేటర్ లా వ్యవహరిస్తామంటే కాలం కచ్చితంగా సమాదానం చెబుతుంది. 151 సీట్లిస్తే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారుం. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్, మత్తు ఆంధ్రప్రదేశ్, అత్యాచారాలాంధ్రప్రదేశ, అందకారాంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్ గా మార్చారని రామ్మోహన్ నాయుడు అన్నారు.