రాయలసీమ రైతాంగం పరిస్థితి నానాటికీ హీనంగా తయారవుతోందని, ఒకవైపు ప్రకృతిశాపం, మరోపక్క పాలకుల నిర్లక్ష్యం, సగటురైతుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా తయారవ్వడంతో గతేడాది సీమ ప్రాంతంలో దాదాపు 17లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగుచేసిన రైతులకు దు:ఖమే మిగిలిందని టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కాలవశ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్కు ఎండిపోయిన వేరుశనగ పంటలను కొరియర్ పార్సిల్ చేసారు కాలువ శ్రీనివాసులు. కొరియర్ లో సీఎం కు పంపిన వేరుశనగ పంట చూసి అయినా రైతులను ఆదుకోవాలని కోరారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! గతేడాది ఆశాజన కంగా వర్షాలుకురవడంతో రైతులు వేరుశనగ సాగుచేశారు. పైరుబాగా పెరిగి, కాయలు వచ్చేసమయంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల ఏర్ప డ్డాయి. కాయలు సరిగా రాక, పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ ఏడాది కూడా రైతులు సంశయంతోనే వేరేగత్యంతరంలేక తిరిగి వేరుశనగనే సాగు చేశారు. మరీముఖ్యంగా అనంతపురం జిల్లాలో దేశంలోనే ఎక్కువగా వేరు శనగను సాగుచేస్తారు. ఒకజిల్లాలో 13 లక్షలఎకరాల్లోవేరుశనగ సాగు చేయడమనేది అనంతపురం జిల్లాకే సాధ్యమైంది. గతేడాది 12లక్షల 20వేలఎకరాల్లో వేరుశనగసాగుచేసిన రైతులు దాదాపు రూ.3వేలకోట్ల విలువైనపంటను నష్టపోయారు. అంతతీవ్రంగా నష్టంజరిగితే జగన్ ప్రభుత్వం రైతులకు కనీసం రూ.300కోట్లు కూడా పరిహారం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో కూడా తెలియడంలేదు. దాంతో దిక్కుతోచని రైతాంగం ఈ ఏడాది వేరుశనగ సాగువిస్తీర్ణాన్ని తగ్గించింది. కేవలం 11లక్ష లఎకరాలకే పరిమితంచేసింది. రాయలసీమవ్యాప్తంగా ప్రస్తుతం అతిత క్కువగా 6లక్షల15వేలహెక్టార్లలో మాత్రమే వేరుశనగను సాగుచేశారు. గత సంవత్సరంతో పోలిస్తే,2.50లక్షల ఎకరాల విస్తీర్ణం తగ్గింది. ప్రభుత్వం సహకరించకపోవడం, గతంలోసాగుకోసం తీసుకున్న అప్పులు చెల్లించక పోవడంతో విస్తీర్ణం బాగాతగ్గింది. ఈ సంవత్సరం కూడా వేరుశనగ పైరు పరిస్థితి ఆశాజనకంగా లేదు. సాగుచేసినదానిలో దాదాపు 15లక్షలఎక రాల్లోని వేరుశనగ పైరు ఎండిపోతోంది. ఇంతనష్టం జరుగుతున్నా ప్రభుత్వంనుంచి స్పందన లేదు.
వ్యవసాయశాఖ మంత్రి ఏంచేస్తున్నారో కూడా తెలియదు. ఆయనకు తన శాఖకు సంబంధించిన సమస్యలు, విషయాలు తప్ప, అన్నీ అవసరమే. రైతులను ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏనాడూ చేసింది లేదు. జగన్మోహన్ రెడ్డికూడా రాయలసీమవాసే. అనంతపురం వేరుశనగ రైతు కళ్లల్లో నీళ్లు వస్తుంటే, ఈ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లయినా లేదు. ఈ ముఖ్యమంత్రి ఎందుకింత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరి స్తున్నారు? గతంలో ప్రకృతి సహకరించకపోయినా, చంద్రబాబునాయుడు గారుముఖ్యమంత్రిగా వారంరోజలు అనంతపురంలోనే ఉండి, వేరుశనగ పైరును కాపాడటానికి శాస్త్రవేత్తలను పిలిపించి మాట్లాడారు. ఉన్నంతో నీటి వనరులను ఉపయోగించి, వేరుశనగ పైరుకు రక్షకతడులు అందించా రు. అయినా కూడా కాస్తోకూస్తో పంట నష్టం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచిన టీడీపీ ప్రభుత్వం, అనంతపురం జిల్లా వేరుశనగ రైతులకు రూ.1126కోట్ల సహాయం అందించింది. 2019 మేలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి,అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. రూ.1800కోట్లవరకు రాయలసీమ రైతులకే పరిహారం ఇస్తున్నా మనిచెప్పాడు. అసెంబ్లీలో ఆయన చెప్పినమాట మాటగానే మిగిలింది తప్ప, రెండున్నరఏళ్లు పూర్తయినా సీమరైతులకు పరిహారం అందలేదు. ముఖ్యమంత్రి మాట చెల్లుబాటుకాలేదని చెప్పడానికి తమకే సిగ్గుగా ఉంది. రాయలసీమ రైతులను ఆదుకోవాలని కోరుతూ, వారికి జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తూ, ముఖ్యమంత్రికి టీడీపీ తరుపున లేఖరాశాం. ఆయన ఇప్పటికైనా కళ్లుతెరిచి, సీమప్రాంత మరీ ముఖ్యంగా అనంతపురం వేరుశనగ రైతులను ఆదుకోవాలని పత్రికాముఖంగా కోరుతున్నాం. గతంలో వారికి అందాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం వెంటనే అందించాలని, వేరుశనగరైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ యంత్రాలు సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి, వ్యవసాయమంత్రి రాయలసీమప్రాంతంలో పర్యటించి రైతుల సమస్యలను పరిష్కరించాలనికూడా డిమాండ్ చేస్తున్నాం. వారు స్పందించని పక్షంలో ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి వైఖరినినిరసిస్తూ, పెద్దఎత్తున రైతులను సమీకరించిప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమిస్తుందని, రాజీలేని పోరాటంచేస్తుందని ప్రభుత్వాన్నిహెచ్చరిస్తున్నాం.