విద్యావిధానంలో ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేయడం సబబు కాదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో విలేఖరుల సమావేశంలో మాట్లాడిన మాటలు మీ కోసం... రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య విధాన పరిషత్ లు పూర్తిగా నాశనమయ్యాయి. రాష్ట్ర అభివృద్ధి శూన్యం. రాష్ట్రానికి రాజధాని లేకపోవడం బాధాకరం. అనేక వ్యవస్థలు పాడైపోయాయి. మిణుకు మిణుకు మంటున్న విద్యా వ్యవస్థకు ఒక కార్పొరేట ఫెసిలిటీస్ కల్పిస్తానని చెప్పారు. విద్యా వ్యవస్థను నాశనం చేసే అంశం ప్రారంభమైంది. 1950 నుండి ఉన్న ఎయిడెడ్ వ్యవస్థను నేడుప్రభుత్వం రద్దు చేయడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్లు పెట్టి నాడు నేడు చేశాం. ఇక ఎయిడెడ్ వ్యవస్థ ఎందుకని చెప్పడం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర బడ్జెట్ లో ఎయిడెడ్ వ్యవస్థకు కేటాయించేది 565 కోట్లు మాత్రమే. ఎయిడెడ్ వ్యవస్థ రద్దుతో కేంద్రం ఇచ్చే 50 శాతం నిధులు ఆగిపోతాయి. ప్రభుత్వానికి అప్పగించము అని చెప్పిన 12 కాలేజీల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. 12 కాలేజీల లెక్చరర్లకు రఘురామకృష్ణరాజు కు ఇచ్చినట్లుగా కౌన్సలింగ్ ఇవ్వడం బాధాకరం. ఎయిడెడ్ కాలేజీల స్థలాలు, వాటి ఆస్తులను స్వాథీనం చేసుకొని అన్యాయానికి పాల్పడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. 9వేల మంది టీచింగ్ స్టాఫ్, 5 వేల నాన్ టీచింగ్ స్టాఫ్ ని ప్రభుత్వం తీసుకుంటే ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నవారు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కొత్త ఉద్యోగాలు భర్తీ చేయడంలేదు. ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేసినందుకుగాను విద్యా విధానంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యముంటుంది కావున కేంద్రం కల్పించుకొని రాష్ట్రానికి న్యాయం చేయాలి.

rrr 25092021 2

అమ్మఒడి, జగనన్న విద్యా దివెన ఇస్తున్నాం,. ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు అనవసరమని చెప్పడం విడ్డూరం. టీచింగ్ స్టాఫ్ ని, ఆస్తులతో సహా అప్పగించాలని, అలా అప్పగించము అని చెప్పిన కాలేజీలను వదలిపెట్టబోమనడం దుర్మార్గం. ప్రభుత్వానికి అప్పగించకుండా ఆ కాలేజీల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలన్నా ప్రభుత్వ అనుమతి కావాలనడం మరీ దుర్మార్గం. కొద్దో గొప్పో విద్యా వ్యవస్థ బాగుందనుకుంటే దాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఎయిడెడ్ వ్యవస్థను రద్దును వ్యతిరేకిస్తూ కోర్టుల్లో కేసులు వేసినవారికి టీడీపీ నైతిక మద్దతు ఇస్తుంది. మేనేజ్ మెంటుకు పొలిటికల్ సపోర్టు కావాలంటే ఇవ్వడానికి టీడీపీ సిద్ధం. విద్యార్థుల తరపున తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ పోరాటం సాగిస్తుంది. ఎయిడెడ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తే పేరెంట్స్, మేనేజ్ మెంట్ నష్టపోతారు. వారి తరపున కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయడం మంచిదికాదు. వ్యవస్థ దెబ్బతింటుంది. జీవో నెంబర్ 42ని రద్దు చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎయిడెడ్ వ్యవస్థని యధాతథంగా ఉంచాలి. ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్లుగా సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలి. టీడీపీ న్యాయ పోరాటం చేస్తుంది. ప్రస్తుతం ఉపాధ్యాయ సంఘాలు కూడా మాట్లాడాల్సిన అవసరముంది. ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేసినందుకు విద్యాశాఖమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read