పోలవరం నిర్వాసితుల బాధలు వినేందుకు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండు రోజులు పాటు పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భగంగా నారా లోకేష్ ముందుగా, భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రమూర్తి దర్శనానికి వెళ్ళారు. ఆలయం వేలుపుల మీడియా ప్రతినిధులు లోకేష్ ను కొన్ని రాజకీయ ప్రశ్నలు అడగగా, తాను ఇక్కడకు సీతారామచంద్రమూర్తి దర్శనానికి వచ్చానని, ఇక్కడ రాజకీయాలు మాట్లాడటం మంచిది కాదని, తరువాత రాజకీయాల గురించి మాట్లాడతానని చెప్పారు. స్వామి వారిని ఏమి మొక్కుకున్నారని మీడియా వారు అడగగా, క-రో-నా థర్డ్ వేవ్ అంటూ వార్తలు వస్తున్న నేపధ్యంలో, క-రో-నా కష్టాలు తొలగిపోయి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు సఖ్యతతో ఉండాలని, రెండు రాష్ట్రాలు ప్రగతి పధంలో ముందుకు వెళ్ళాలని అన్నారు. అలాగే పోలవరం నిర్వాసితుల బాధలు తీరిపోవాలని, మొక్కుకున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు, పోలవరం ప్రాజెక్ట్ వల్ల, ఇరు రాష్ట్రాల సరిహద్దులో, ఉన్న అయుదు గ్రామాల ఇబ్బందులు గురించి అడగగా, ఇద్దరు ముఖ్యమంత్రులు మంచి స్నేహితులు అని, ఇద్దరూ కూర్చుని మాట్లాడకుంటే నిమిషాల్లో సమస్య పరిష్కారం అయిపోతుందని అన్నారు.
ఇద్దరూ మంచి స్నేహితులేగా.. కేసీఆర్, జగన్ పై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు...
Advertisements