ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏంటో అర్ధం కాక ప్రజలు తలలు బాదుకుంటున్నారు. మొన్నటి దాకా చక్కగా అమరావతి రాజధాని అని చెప్పారు. కానీ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వచ్చిన తరువాత, రాజధాని మూడు ముక్కలు అయ్యింది. మూడు ముక్కల రాజధానిలో ఏది రాజధానో, ఏది ఏంటో అర్ధం కాక, ప్రజలు బుర్రలు బాదుకుంటుంటే, మంత్రులు ప్రకటనలు మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. రెండు రోజుల నుంచి మంత్రి బొత్సా, అవంతి చేస్తున్న ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మరో రాజధాని తెర పైకి వచ్చింది. పరిశ్రమల శాఖా మంత్రి గౌతంరెడ్డి ఈ రోజు రాజధానుల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అదే సచివాలయం, అదే రాజధాని అంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేసారు. పులివెందులలో ఉంటే పులివెందులే రాజధాని, ఆయన ఎక్కడ ఉంటే అదే రాజధాని, ఏ ప్రాంతంలో ఉంటే అదే రాజధాని అంటూ, వ్యాఖ్యానించారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని, ఇప్పుడు ఈ అంశం కోర్టులో ఉందని అన్నారు. అయితే మంత్రి మాట్లాడుతూ, ఎక్కడ ఉంటే అదే రాజధాని అని చెప్పటం, పులివెందుల గురించి చెప్తూ ఉండటంతో, ఇప్పుడు పులివెందుల పైకి తెస్తారా ఏమిటి అని సోషల్ మీడియాలో సెటైర్ లు పేలుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read