ఒక పెద్ద కుదుపు కుదిపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇప్పుడు ఈడీ చేతిలోకి వెళ్ళింది. ఈ రోజు నుంచి డ్రగ్స్ కేసు పై ఈడీ విచారణ ప్రారంభం అయ్యినిడ్. ఈ రోజు ఈడీ విచారణకు దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరు అయ్యారు. విచారణకు రావాలని ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన 12 మందిని ఈడీ విచారణ చేయనుంది. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 20 వరకు ఈడీ విచారణ కొనసాగనుంది. ఇప్పటికే దీని పై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసారు. డ్రగ్స్ కేసులో ఆబ్కారీ శాఖ సిట్, 12 మంది పై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసింది. అలాగే 11 చార్జ్ షీట్లు కూడా సిట్ అధికారులు దాఖలు చేసారు. డ్రగ్స్ కేసులో మొత్తం 62 మందిని ఇప్పటికే సిట్ విచారణ చేసింది. గతంలో చిత్ర పరిశ్రమకు చెందిన 12 మందిని సిట్ ప్రశ్నించింది. అయితే సిట్ విచారణ నేమ్మదించటం వెనుక రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ కేసు ఈడీ చేతిలోకి వెళ్ళటంతో, టాలీవుడ్ ప్రముఖులకు దడ మొదలయ్యింది అనే చెప్పాలి. ఎంత మంది బయట పడతారో, ఎంత మంది బుక్ అవుతారో చూడాలి.
టాలీవుడ్ ప్రముఖుల పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ...
Advertisements