గత నెల రెండు నెలలుగా, ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, ప్రభుత్వం దాస్తున్న విషయాలు, అలాగే ఏమిఏమి తాకట్టు పెట్టి తెస్తున్న అప్పులు, ఇలా అనేక విషయాల పై, వరుస కధనాలు వచ్చాయి. దీనికి తోడుగా, పయ్యావుల కేశవ్ పెట్టిన మూడు ప్రెస్ మీట్లతో, రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి డొల్లతనం మొత్తం బయట పడింది. దీంతో ప్రభుత్వం షాక్ తింది. అసలు సియం దగ్గర చర్చిస్తున్న విషయాలు బయటకు ఎలా వెళ్తున్నాయో అర్ధం కాక తల బాదుకుంది. చివరకు కొంత మంది ఆర్ధిక శాఖ ఉద్యోగులను సస్పెండ్ చేసారు. అయినా ఆ పత్రికలో వరుస కధనాలు వచ్చాయి. తరువాత ఇలా కాదని, అసలు జీవోల కూడా బయట పెట్టటం ఆపేశారు. అయినా ఆ పత్రికలో వార్తలు ఆగలేదు. దీంతో ప్రభుత్వానికి ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు అదే పత్రికలో ఒక కధనం వచ్చింది. ఈ లీకులు కలవరపెడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు అన్నీ బయట పడుతూ ఉండటంతో, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నట్టు ఆ కధనంలో వచ్చింది. ఆ కధనం ప్రకారం సియం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆర్ధిక శాఖ అధికారులతో పాటు, ఇతర శాఖల ముఖ్య అధికారులకు కూడా ఒక మెసేజ్ పంపించారని, ఆ కధనంలో వచ్చింది.
దీని ప్రకారం, ఇక నుంచి సియం దగ్గర జరిగే సమీక్షలో నేరుగా ఎక్కడా ఆర్ధిక పరమైన అంశాలు ప్రస్తావించ కూడదని, అలాగే ఆర్ధిక అంశాలకు సంబంధించి ఎలాంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వకూడదు అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే, సహజంగా సియం దగ్గర జరిగే ఆర్ధిక సమీక్షల్లో పెండింగ్ బిల్లులు, అప్పులు ఎలా తెచ్చేది, ఖర్చులు ఇలా అన్ని చిన్న చిన్న అంశాలు కూడా ఎక్కడ దాయకుండా, మొత్తం సియం దగ్గర సమీక్షలో చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ నుంచే సమాచారం లీక్ అవుతుందని, ప్రభుత్వ పెద్దలు ఒక అంచనాకు వచ్చారట. అందుకే ఇక నుంచి, ఇక్కడ అలాంటి విషయాలు చర్చించవద్దు అని చెప్తున్నారు. అయినా, ఇక్కడ దాయటానికి ఏమి ఉంటుంది ? ప్రజలకు ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా ? కాగ్ లాంటి సంస్థలు ఉండేది, ఇవి బయట పెట్టటానికే కదా ? ఇలా సమాచారం దాచి, ప్రజలకు వాస్తవ పరిస్థితి చెప్పకుండా ఉంటే, చివరకు అది ప్రభుత్వానికే మరింత ఇబ్బందిగా మారే అవకాసం ఉంటుంది.