ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత కొద్ది రోజులుగా సిబిఐ కోర్టు చుట్టూ తిరుగుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, బెయిల్ పై బయట ఉన్న జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, రఘురామరాజు పిటీషన్ వేయటం, దాని పై విచారణ జరగటం, నిన్న మొత్తం, దీని మీద టెన్షన్ వాతావరణం ఉండటం, చివరకు సిబిఐ కోర్టు, ఈ కేసు తీర్పుని వచ్చే నెల 15కు వాయిదా వేసింది. ఇది ఇలా ఉంటే, విజయసాయి రెడ్డికి, ఈ రోజు సిబిఐ కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సిబిఐ కోర్టులో నెల రోజులు క్రితం, విజయసాయి రెడ్డి ఒక పిటీషన్ వేసారు. తనకు విదేశాలు వెళ్లేందుకు పర్మిషన్ కావాలని కోరారు. విజయసాయి రెడ్డి బెయిల్ పై ఉండటం, బెయిల్ కండీషన్లో విదేశాలకు వెళ్ళకూడదు అని ఉండటంతో, కోర్టు పర్మిషన్ తీసుకునే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలోనే విజయసాయి రెడ్డి కోర్టులో ఒక పిటీషన్ వేసారు. తనకు విదేశాలకు వెళ్ళటానికి కోర్టు అనుమతి కోరారు. అయితే గత నెల రోజులుగా ఈ విషయం నానుతూ ఉండటంతో, ఈ విషయంలో విజయసాయి రెడ్డికి రిలీఫ్ వస్తుందో లేదో అని అందరూ అనుకున్నారు. ఈ నేపధ్యంలోనే, ఈ రోజు ఈ పిటీషన్ పై తీర్పు వచ్చింది. ఈ రోజు తీర్పు ఇచ్చిన సిబిఐ కోర్టు, విజయసాయి రెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇస్తూ, కండీషన్స్ కూడా పెట్టింది.
విజయసాయి రెడ్డికి రెండు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ నెలలో రెండు వారాల పాటు విజయసాయి రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నారు. దీనికి కోర్టు అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి దుబాయ్, బాలి, మాల్దీవులకు వెళ్తానని సిబిఐ కోర్టుని కోరారు. తీరప్రాంతాల అభివృద్ధిపై, అక్కడ స్థితిగతుల పై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి, కోర్టు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి అనుమత ఇచ్చిన సిబిఐ కోర్టు, రూ.5 లక్షల పూచీకత్తుతో పాటుగా, మరో ఇద్దరి పూచీకత్తులు కూడా సమర్పించాలి అంటూ, కండీషన్స్ పెట్టి, విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. మొత్తం మీద నిన్న మొత్తం టెన్షన్ పడిన వైసీపీ, ఈ రోజు ఈ ఆదేశాలతో బిగ్ రిలీఫ్ పొందారు. ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ రోజు నుంచి అయుదు రోజుల పాటు, హోలిడిలో ఉన్నారు. విదేశాలకు వెళ్తారని అనుకున్నా, ఆయన భారత దేసంలోనే వివిధ రాష్ట్రాల్లో హాలిడే ఎంజోయ్ చేస్తారని తెలిసింది. మొత్తానికి వైసీపీ టాప్ బాసులు హోలిడి మూడ్ లో ఉన్నారు.