వైసీపీ సోషల్ మీడియా ఎలాంటి పోస్టులు పెడుతుందో, ఎలాంటి రాతలు, ఎలాంటి ఫేక్ లు, ఎలాంటి మార్పింగ్లు చేస్తుందో అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తరువాత, వీరిని ఆపేవారు లేకుండా పోయారు. చివరకు జడ్జిలను, కోర్టులను కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు దిగజార్చే విధంగా పోస్టింగులు పెట్టే స్థాయికి వచ్చారు. ఇది ఎంత వరకు వెళ్ళింది అంటే, ఏకంగా హైకోర్టు, తమ పై వైసీపీ పైడ్ బ్యాచ్ పెడుతున్న పోస్టులు గురించి సిబిఐ ఎంక్వయిరీ చేయమనే దాకా వెళ్ళింది. ఇప్పటికే సిబిఐ వీళ్ళ పని పట్టే పనిలో ఉంది. ఈ బ్యాచ్ విదేశాల్లో కూడా ఉంది. ముఖ్యంగా పంచ్ ప్రభాకర్ అనే పశువులు డాక్టర్ కూడా ఉన్నాడు. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సభ్యుడు కూడా. ఇప్పుడు ఈ పంచ్ ప్రభాకర్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసారు. యుట్యూబ్ ఛానల్ లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వారి అందరి పైన, అసభ్య పదజాలంతో, వీడియోలు చేస్తున్నాడు అంటూ, ఎంపీ రఘురామకృష్ణం రాజు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసారు. పంచ్ ప్రభాకర్ అసభ్య పదజాలంతో, ప్రముఖుల పైన వీడియోలు చేస్తూ ఉంటారని, ముఖ్యంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పై కూడా ఇటీవల బూతులతో అసభ్యంగా మాట్లాడిన వీడియోలు ఉన్నాయి అంటూ, ఆ వీడియోల లింక్ లను ఢిల్లీ పోలీసులకు ఇచ్చారు.
అలాగే చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాతో పాటుగా, ఇతర ప్రముఖులు పై కూడా, ఇలాగే అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ, వీడియోలు చేసారని ఆ లింక్ లు కూడా ఇచ్చారు. వీటి అన్నిటినీ ఢిల్లీ పోలీసులకు ఎంపీ రఘురామరాజు ఇచ్చారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, ప్రాధమిక విచారణ చేసి, అతని పై కేసు నమోదు చేసారు. అలాగే ఈ కేసు పై దర్యాప్తు కూడా చేయనున్నారు. ఇప్పటికే యుట్యూబ్ సంస్థకు కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసారు. పంచ్ ప్రభాకర్ వీడియోలకు సంబందించిన పూర్తి సమాచారాన్ని తమకు అందచేయాలని, యుట్యూబ్ సంస్థకు నోటీసులు ఇచ్చారు. యుట్యూబ్ సంస్థ ఇచ్చే తదుపరి సమాచారం ఆధారంగా, విచారణ కొనసాగబోతుంది. ప్రస్తుతం ఇతను అమెరికాలో ఉంటున్నాడు. ఢిల్లీ పోలీసులు అతన్ని ఇక్కడకు పిలిపించే అవకాసం కూడా ఉంది. రఘురామరాజు కూడా ఆంధ్రప్రదేశ్ లో కాకుండా, వ్యూహాత్మకంగా ఢిల్లీలో ఈ కేసు పెట్టి, పంచ్ ప్రభాకర్ ని ఫిక్స్ చేసారనే చెప్పాలి.