గుంటూరులో రమ్య కుటుంబాన్ని పరామర్శించటానికి వచ్చిన నారా లోకేష్ ని, పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లోకేష్ వచ్చిన సమయంలో, వైసీపీ నేతలు కూడా అక్కడకు చేరుకుని , లోకేష్ కార్యక్ర్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటంతో, అక్కడ వాగ్వివాదం మొదలైంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, అనూహ్యంగా లోకేష్ తో పాటుగా, నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజా, ధూళిపాళ్ళ నరేంద్ర తదితర నేతలను ఆర్రేస్ట్ చేసారు. లోకేష్ ని అరెస్ట్ చేసి పత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో మహిళా కార్యకర్తలు, టిడిపి శ్రేణులు భారీ ఎత్తున పత్తిపాడు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. గంట గంటకు అక్కడ కార్యకర్తలు పెరిగి పోయారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపుగా 5 గంటలకు పైగా లోకేష్ ని పోలీస్ స్టేషన్ లోనే ఉంచిన పోలీసులు, సాయంత్రానికి వదిలేస్తారని అందరూ అనుకున్నారు. అయితే అక్కడ జనాలను చుసిన పోలీసులు, లోకేష్ ను బయటకు తీసుకుని వచ్చారు. దీంతో అందరూ లోకేష్ ని వదిలేస్తున్నారు అని అనుకున్నారు. అయితే అనూహ్యంగా పోలీసులు ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు. ఇక్కడ పోలీసులు కూడా వ్యూహాత్మికంగా వ్యవహరించారు. లోకేష్ ని తన వాహనంలో ఎక్కించటంతో, అందరూ వదిలేస్తున్నారని అనుకున్నారు.

ln arrest 16082021 2

అయితే లోకేష్ వాహనం మాత్రమే తీసుకుని, మిగతా వాహనాలు నిలిపివేశారు. ఉన్నాతాధికారుల ఆదేశం అని, వేరే స్టేషన్ కు తరలిస్తున్నాం అని అన్నారు. దీంతో అందరూ లోకేష్ ని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు తెసుకుని వెళ్తున్నారని అనుకున్నారు. అక్కడకి కాకుండా పెదనందిపాడు స్టేషన్ అన్నారు, ఇప్పుడు అది కూడా కాకుండా పొన్నూరు వైపు లోకేష్ ని తరలిస్తున్నారు. మొత్తంగా లోకేష్ ని స్టేషన్ ల చుట్టూ తిప్పుతున్నారు. అయితే ఇప్పటికీ ఎటు తీసుకుని వెళ్తున్నారు అనే దాని పై అయితే స్పష్టం లేదు. అయితే ఆయనకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వేస్తారా, లేదా ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తారా అనేది తెలియాల్సి ఉంది. చిన్న దానికి కూడా ఇంత హడావిడి ప్రభుత్వం ఎందుకు చేస్తుందో అర్ధం కావటం లేదని టిడిపి నేతలు అంటున్నారు. పరామర్శకు వెళ్తే, ఇలా అరెస్ట్ చేయటం, అలాగే ఇలా స్టేషన్ లు చుట్టూ తిప్పటం ఏమిటో అర్ధం కావటం లేదని అంటున్నారు. మరి లోకేష్ ని వదిలేస్తారా ? ఏమి చేస్తారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read