రాష్ట్ర ప్రభుత్వ శైలి చాలా విడ్డూరంగా, చాలా వింతగా ఉంటోందని, ఏ అ-ఘా-యి-త్యం, అనర్థం జరిగినా, అ-రా-చ-కం జరిగినా డబ్బుతో దాన్ని అణచి వేస్తామన్నట్లుగా ప్రభుత్వం వ్యహరిస్తుండటం దురదృష్టకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. గురువారం ఆయన తన నివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం...! "జరుగుతున్న దా-రు-ణా-లపై ప్రభుత్వానికి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎవరికి చెప్పాలి? ముఖ్యమంత్రా ప్రజలకు అందుబాటులో ఉండరు. సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పినా ఆయన పట్టించుకోరు, మరి ప్రజలగోడు వినేదెవరు? నా ప్రశ్న కు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైనే ఉంది. ఆగస్ట్15న స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు బ్రహ్మండంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి చెబుతున్న సమయంలోనే రమ్య అనే బీటెక్ విద్యార్థిని దారుణంగా ఒక దుర్మార్గుడి చేతిలో నడిరోడ్డుపై అ-తి-కి-రా-త-కం-గా చం-ప-బ-డిం-ది. ఆ ఘటనతో రాష్ట్రమంతా ఉలిక్కిపడింది. పట్టపగలు, స్వాతంత్ర్య దినోత్సవం నాడు, ఆడ బిడ్డలెవరూ స్వేచ్ఛగా తిరగే పరిస్థితి లేదని రాష్ట్రమంతా గగ్గోలు పెట్టింది. కానీ ముఖ్యమంత్రేమో మృ-తు-రా-లి కుటుంబానికి పదిలక్షలిచ్చి, రమ్య హ-త్యో-దం-తా-న్ని ప్రజల్లో నలగకుండా సద్దుమణిగేలా చేయాలని చూశారు. ఎంతటి ఘోరాన్నైనాసరే డబ్బుతో మేనేజ్ చేయొచ్చన్న ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఈ ఘటనలో స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యమంత్రి చేయాల్సిందేమిటి? దుండగుడిని పట్టుకొని కఠినంగా శిక్షించాలి. దళితవర్గానికి చెందిన హోంమంత్రితో సజ్జల రామకృష్ణారెడ్డి చిలుకపలుకులు పలికించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏదిచెప్పమంటే ఆమె అది చెబుతారు. హోంమంత్రిగా ఆమె విధులు, బాధ్యతలు, చట్టాల గురించి ఆమెకు తెలియదు. దిశా చట్టం కింద రాష్ట్రంలో ముగ్గురికి ఉ-రి-శి-క్ష-లు పడ్డాయని, 20 మందికి జీవితకాల జైలు శిక్షలు పడ్డాయని ఆమెచెప్పడం విడ్డూరం. ఆమె చెప్పిందంతా శుద్ధ అబద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన దిశా చట్టం కేంద్రం కొర్రీలు వేయడంతో అది అక్కడే ఆగిపోయింది. దిశా చట్టం శిక్షల గురించి హోంమంత్రి చెప్పిందంతా శుద్ధ అబద్ధం. రాష్ట్రంలో దిశా చట్టమే లేదు. లేని దిశ చట్టంతో హోంమంత్రి ముగ్గురికి ఉ-రి శిక్షలు, 20మందికి జీవితకాల శిక్షలు వేయించారా? ఏ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో ముగ్గురికి ఉ-రి శిక్షలు పడ్డాయో, 20మందికి యావజ్జీవ శిక్షలు పడ్డాయో, ఏ న్యాయమూర్తి వారికి శిక్షలు వేశారో, నిందితులపేర్లతో సహా, హోంమంత్రి శ్వేతపత్రం విడుదల చేయాలి.

లేదా అన్నీ అబద్ధాలు పలికిన హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఆమెతో పచ్చి అబద్ధాలు చెప్పించిన డిఫ్యాక్టో హోంమంత్రి సజ్జల కూడా తన పదవికి రాజీనామా చేయాలి. ఎందుకిలా సిగ్గుమాలిన ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది? దళిత మహిళతో ఎందుకిలా చెప్పిస్తోంది? ఆమె చెప్పిన దానిపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే. సజ్జల రామకృష్ణారెడ్డైనా సరే, ఎవరికి శిక్షలుపడ్డాయో చెప్పాలి. లేని చట్టంతో సుచరితగారు ముగ్గురికి ఉ-రి శిక్ష, 20మందికి యావజ్జీవశిక్షలు వేసేసింది. దిశా యాక్ట్ ఏ2 విజయసాయి రెడ్డి సృష్టించే సూట్ కేసు కంపెనీలా ఉంది. సూట్ కేసు కంపెనీ ఎక్కడుంటుందో తెలియదు, కానీ డబ్బు మాత్రం ఫ్లో అవుతూంటుంది. అలానే ఆలూ... చూలు లేని సూట్ కేస్ కంపెనీ లాంటి దిశ చట్టం కింద ఉరిశిక్షలు పడ్డాయని హోంమంత్రి చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. హోమంత్రి శిక్షలు పడ్డాయని చెబుతున్న ఆ అభాగ్యులు ఎవరు? ప్రభుత్వానికి, పాలకులకు పారదర్శకంగా ఆలోచన చేయాలని లేదు. రోజు గడుపుకోవడానికి ఏదో ఒకటి చెప్పి, తప్పించుకోవడానికి చూస్తోంది. తాను అడిగే ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం చెప్పలేదు. సూట్ కేస్ చట్టాలను తాను మోయలేనని ఆమే తనకు తాను రాజీనామా చేయాలి. తన సలహాలతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి కుహనా సలహాదారు తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. 

Advertisements

Advertisements

Latest Articles

Most Read