ప్రభుత్వమిచ్చే జీవోలు (గవర్నమెంట్ ఆర్డర్లు) ఇకనుంచి పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉండవని, ప్రభుత్వమే జీవోలు అందరూచూసేలా వెబ్ సైట్ లో పెట్టకూడదని ఆదేశాలిచ్చిందని, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమం త్రి ఈ విధంగా గొప్పకానుక ఇచ్చాడని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసే జీవోలు ఇక నుంచీ ప్రజలకు అందుబాటులో ఉండవని, ప్రభుత్వం ఎప్పుడు వాటిని అందుబాటులోకి తీసుకొస్తుందో కూడా తెలియదని చెప్పారు. జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా ఇస్తున్న రహస్య జీవోలు, బ్లాంక్ జీవోల వ్యవహారం బట్టబయలు కావడంతో, పాలకులు ఈనిర్ణయం తీసుకున్నారని అశోక్ బాబు చెప్పారు. సాధారణంగా ఆగస్ట్ 15న సెలవురోజని, ఆరోజున ఎవరూ కార్యాలయాల్లో పనిచేయరని, కానీ ఈ ప్రభుత్వం అదే రోజున జీవోలు పబ్లిక్ డొమైన్ లో ఉండవంటూ ఆర్డర్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించే ప్రజల హక్కుని స్వాతంత్ర్య దినోత్సవం నాడే జగన్ ప్రభుత్వం హరించిందని, ఇంతకంటే దిగజారుడుతనం మరోటి ఉండదని టీడీపీనేత స్పష్టం చేశారు. తెలుగుదేశంపార్టీ తరుపున జీవోఐఆర్ వెబ్ సైట్లో ప్రభుత్వం దాదాపు 40, 50వరకు జీవోలు పెట్టారని కొన్నిరోజుల క్రితం గవర్నర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్ష ఫిర్యాదుపై గవర్నరే ఆశ్చర్యపోయారని, దాంతో చేసేదిలేక ఈ ప్రభుత్వం జీవోలను వెబ్ సైట్ లో పెట్టకూడదనే నిర్ణయానికి వచ్చిందన్నారు. ప్రభుత్వమిచ్చే ఏ జీవో అయినా గవర్నర్ అనుమతితోనే ఇవ్వాలని, కానీ అలా ఎక్కడా జరగకపోబట్టే, ప్రభుత్వం జీవోలను బహిర్గతం చేయకూడదని నిర్ణయించిందన్నారు. తాను గతంలో ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా పనిచేసి నప్పుడు ఏ జీవో కావాలని అడిగినా సంబంధిత అధికారులు వెంటనే వెబ్ సైట్లో చూసి ఇచ్చేవారన్నారు. ఏపీప్రభుత్వం జీవోల విషయంలో ఇంత పారదర్శకంగా వ్యవహరిస్తోందా అని గతంలో అనేక రాష్ట్రాలవారు ఆశ్చర్యపోయిన సందర్భాలు న్నాయన్నారు. వెబ్ సైట్లో నుంచి తీసుకునే జీవోలు అధికారికమైనవే అని గతంలో ప్రభుత్వం కూడా చెప్పడం జరిగిందన్నారు. అలాంటి పారదర్శకమైన జీవోల పరిశీలనను ప్రజలకు ఈ ముఖ్యమంత్రి శాశ్వతంగా దూరం చేశాడన్నారు. ముఖ్యమంత్రికి ఉన్న అసహనం, చేతగాని తనమే ఇందుకు కారణమన్న అశోక్ బాబు, ప్రభుత్వం ఈ విధంగా చీకటి రాజ్యంగా రాష్ట్రాన్ని ఎందుకు మారుస్తుందో పాలకులే చెప్పాలన్నారు. ఇప్పుడు జీవోలు బహిర్గతంచేయకూడదని నిర్ణయిం చుకున్న ప్రభుత్వం, భవిష్యత్ లో పోలీస్ స్టేషన్లలో నమోదయ్య ఎఫ్ఐఆర్ లను కూడా పబ్లిక్ డొమైన్ లోఉంచకుండాచర్యలు తీసుకుంటుందేమో అని అశోక్ బాబు వాపోయారు.

2012లో కేంద్రప్రభుత్వం నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెసబుల్ పాలసీ పేరుతో కొత్త వ్యవస్థను తీసుకొచ్చిందని, దానిప్రకారం ప్రజల సొమ్ముతో చేసే పనులకు సంబంధించిన సమాచారమంతా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని చెప్పడం జరిగిందన్నారు. అదేవిధంగా సమాచారహక్కు చట్టం కింద కూడా ప్రజలు అడిగిన సమాచారాన్ని వారికి అందించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా అధికారిని ప్రభుత్వం అకారణంగా బదిలీ చేయడమో, సస్పెండ్ చేయడమో చేశాక, సదరు అధికారి కోర్టుకు వెళ్లాలనుకుంటే, జీవోలు అందుబాటులో లేకపోతే ఎలాగన్నారు? ప్రభుత్వం ఎందుకింతలా భయపడుతోందో తెలియడం లేదన్న అశోక్ బాబు, జీవోలు అందుబాటులో ఉంచకుండా నిర్ణయం తీసుకోవడమే కాకుండా, అప్పుల తాలూకా అసెంబ్లీకి సమర్పించాల్సిన కాగితాలను కూడా గతంలో ఇవ్వలేదన్నారు. టీడీపీవారు గవర్నర్ కు, ఫిర్యాదు చేశారనే జీవోలను అందుబాటులో లేకుండా చేశారన్నారు. ఏ వ్యవస్థ , ఏవ్యక్తి అయితే ప్రభుత్వానికి అనుకూలంగా లేరో, వారిని రూపుమాపడానికి ఈ దుర్మార్గపు సర్కారు వెనుకాడటం లేదన్నారు. ఎప్పుడూ తెరమీదకు వచ్చే సలహాదారులు ఈ వ్యవహారంపై ఏంచెబుతారో చెప్పాలన్నారు. ప్రజలకు సమాచారం తెలియకుండా చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ప్రభుత్వంతో ఎలాంటి సంబంధంలేని సామాన్యులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకి స్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంగానీ, ఇతర రాష్ట్రాలు గానీ ఏపీకంటే అడ్వాన్స్ గానే ఉన్నాయని, ఏపీ ప్రభుత్వం చేసే అప్పుల తాలూకా వివరాలను ఆర్బీఐ, కేంద్రప్రభుత్వం బహిర్గతం చేస్తూనే ఉన్నాయన్నారు. నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెస్ పాలసీకి విరుద్ధంగా రాష్ట్రప్రభుత్వం తీసుకునే ప్రతినిర్ణయం ప్రజలకు తెలియాల్సిందేనని, దానిలో మరోమాటకు తావేలేదని అశోక్ బాబు తేల్చిచెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read