తిరుమల తిరుపతి దేవస్థానంలో 24 మందిని సభ్యులుగా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 245 ను హైకోర్టులో సవాల్ చేసారు. ఈ రోజు హైకోర్టులో ఈ పిటీషన్ పై విచారణ జరిగింది. ఈ పిటీషన్ విచారణకు వచ్చిన సందర్భంగా న్యాయవాది అశ్విని కుమార్ వాదనలు వినిపించారు. బోర్డులో నియమించిన 24 మందిలో, 14 మందికి నేర చరిత్ర ఉందని, మరో నలుగురికి రాజకీయ నియామకాలు జరిగాయని ఆయన వాదించారు. ఈ 14 మందికి సంబంధించిన కేసులను, ఇతర వివరాలను హైకోర్ట్ ధర్మాసనానికి అందించారు. దీనిపైన హైకోర్టు ధర్మాసనం ఈ 18 మందికి కుడా ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేరుస్తూ, వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీని పై టిటిడి స్టాండింగ్ కౌన్సిల్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. జీవో నెంబర్ 245 ను సవాల్ చేయటం అసమంజసం అని, అదే విధంగా వారిని ప్రతివాదులుగా చేరుస్తూ, వాళ్ళకి నోటీసులు జారీ చేయటం ఏమిటి అని ప్రశ్నించింది. అయితే దీని పై హైకోర్టు ధర్మాసనం మీకు ఉన్న అభ్యంతరం ఇందులో ఏమి ఉంటుంది, అంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో టిటిడి స్టాండింగ్ కమిటీ దగ్గర సమాధానం లేకుండా పోయింది. వాళ్ళకు లేని అభ్యంతరం, వీరికి ఎందుకు అర్ధం కాలేదు.

ttd 06102021 2

ఏదైతే ఈ 18 మందికి ఏవైతే నోటీసులు జారీ చేసామో, వాళ్ళు ఏదైనా అభ్యంతరం ఉంటే, వాళ్ళు అభ్యంతరం తెలుపుతారు కానీ, స్టాండింగ్ కౌన్సిల్ కు ఏమి సంబంధం అంటూ, మీకు ఈ విషయంలో ఏ సంబంధం లేదు కదా అని హైకోర్టు స్పష్టం చేసింది. పైగా దసరా సెలవులు అనంతరం, ఈ కేసుని ప్రాధాన్యత కేసుగా తీసుకుంటాం అని చెప్పిన హైకోర్టు, ఈ కేసు పై సెలవులు అనతంరం వెంటనే వాదనలు వింటాం అని, ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడిన అంశం అని చెప్పి, హైకోర్టు స్పష్టం చేసింది. దసరా సెలవులు అనంతరం ఈ కేసు వాయిదా వేసింది. ఎవరు అయితే నేర చరిత్ర ఉందని ఆరోపిస్తున్నారో వారికి, అలాగే రాజకీయ నియామకాలు అని ఆరోపిస్తున్నారో వారికి, మొత్తం 18 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసి, వారిని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టిటిడి జంబో బోర్డు సభ్యులకు షాక్ ఇస్తూ, ఆ జీవోని హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ కేసు పై ఏమి తేలుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read