ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దేబ్బాకు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు, వైసిపీ పార్టీ రంగులు వేయటం పై, రాష్ట్ర హైకోర్టులో జైభీమ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేష్ కుమార్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై, గత వారం హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఈ రంగులను తొలగించాలని, చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలతో పాటుగా, ప్రభుత్వ భవనాలకు కూడా వైసిపి రంగులు వేయటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే వీటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేయటమే కాకుండా, అన్ని శాఖలకు కూడా తగిన ఆదేశాలు లిఖిత పూర్వకంగా ఇవ్వాలి అని చెప్పి, పది రోజులు క్రితం హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కోర్టు ముందు హాజరు అయిన పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదిని కోర్టు ఆదేశించింది. ఈ రోజు మళ్ళీ ఇదే కేసు విచారణకు వచ్చింది. అయితే ఈ రోజు విచారణ సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి, అఫిడవిట్ దాఖలు చేసింది. భవిష్యత్తులో ఏ ప్రభుత్వ భవనానికి కూడా రంగులు వేసేది లేదని, హైకోర్టులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది ఈ రోజు ప్రమాణ పత్రం దాఖలు చేసారు. ఒక విధంగా కోర్టు దెబ్బకు ప్రభుత్వం దిగి వచ్చిందనే చెప్పాలి.
అదే విధంగా అఫిడవిట్ రూపంలో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని, గత నెలలో రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన నేపధ్యంలోనే, ప్రభుత్వం దిగి వచ్చింది. అఫిడవిట్ రూపంలో, ఇక మీదట రాష్ట్రంలో ఎక్కడా కూడా, ఏ విధమైన ప్రభుత్వ భవనాలకు కూడా పార్టీ రంగులు వేయం అని, కోర్టుకు చెప్పారు. హైకోర్టు మాజీ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్, పిటీషనర్ తరుపున వాదనలు వినిపించారు. ఈ రోజు ప్రమాణ పత్రం దాఖలు చేయటంతో అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలను అనుసరించారు అని చెప్పి, శ్రవణ్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేసారు. అయితే భవిష్యత్తులో మాత్రం, ఏ ప్రభుత్వ భవనానికి కానీ, చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలకు, ఏ ఇతర ప్రభుత్వ భవనాలకు కానీ, వైసీపీ రంగులు వేస్తే మాత్రం, భవిష్యత్తులో మళ్ళీ కోర్టుకు వస్తామని, ప్రభుత్వం తన అఫిడవిట్ కు కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు. అయితే గత ఏడాది హైకోర్టు, సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలిన తరువాత కూడా, ప్రభుత్వం మళ్ళీ రంగులు వేసి, ఇప్పుడు రెండో సారి దెబ్బ తింది. మరి ఈ సారి అయినా చెప్పిన మాట అనుసరిస్తారో లేదో చూడాలి.