ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది కేంద్రం. ఏపి జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం దెబ్బ కొట్టింది. పోలవరం ప్రాజెక్ట్ నిధులు పై కేంద్ర ఆర్ధిక శాఖ తేల్చేసింది. డబ్బులు ఇవ్వం అంటూ చేతులు ఎత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి మొదలైంది. చంద్రబాబు వల్ల కాలేదు, మేము మెడలు వంచి పోలవరం ప్రాజెక్ట్ తీసుకుని వస్తాం అని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు చేతులు ఎత్తేసింది. గతంలో కేంద్ర మంత్రివర్గం ఏదైతే తీర్మానం చేసిందో, ఆ తీర్మానం మేరకు రూ.20 వేల కోట్లకు మించి ఎట్టి పరిస్థితిలో కూడా రూపాయి కూడా అదనంగా నిధులు ఇవ్వం అంటూ తేల్చి చెప్పింది. దీని అంతటి పై, కేంద్ర జల శక్తి శాఖ, కేంద్ర ఆర్ధిక శాఖకు ఒక లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి, అదనంగా మరో నాలుగు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి, ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది. దేశంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రాజెక్ట్ లకు సంబంధించి, ఇటీవల అదనంగా నిధులు మంజూరు చేసిన విసయాన్ని ఆ లేఖలో కేంద్ర జల శక్తి శాఖ , ఆర్ధిక శాఖ అధికారులకు గుర్తు చేసింది. ఈ గుర్తు చేసిన అనంతరం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలి అంటే, డ్యాముకు సంబంధించి మరో నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఆ డబ్బులు ఇవ్వాలని కోరింది.

jagan 07102021 2

అయితే ఆ లేఖను పరిశీలించిన కేంద్ర ఆర్ధిక శాఖ, పలు అంశాలను ఈ సందర్భంగా కూడా ప్రస్తావించింది. ప్రధానంగా గతంలో కేంద్ర మంత్రి వర్గం రూ.20 వేల కోట్లకు మించి ఇవ్వకూడదని తీర్మానం చేసిందని, దీనికి సంబంధించి తమకు ఇచ్చేందుకు అదనంగా ఇచ్చేందుకు, నిబంధనలు అంగీకరించవని, కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది. అదే విధంగా దేశంలో ఇతర ప్రాజెక్ట్ లు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాజెక్ట్ లకు సంబంధించి, ఇప్పటికే పూర్తయ్యాయని, అదనంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం నిర్మించిన ఇతర ప్రాజెక్ట్ లకు, నీటి వసతులు కల్పించేందుకే ఈ నిధులు మంజూరు చేస్తున్నాం అని, అంతే కాని పూర్తికాని ప్రాజెక్ట్ లకు, అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని పేర్కొంది. ఈ సమాచారాన్ని రాష్ట్ర అధికారులకు కూడా తేల్చి చెప్పారు. ఈ లేఖను కూడా రాష్ట్రానికి పంపించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ తగలింది. ఇక ఇందులో తాము ఏది చేయలేమని కేంద్రం చెప్పేసింది. రాజ్యసభలో వైసిపీకి బలం ఉన్నా, కేంద్రం పై ఒత్తిడి తేకుండా, అన్ని బిల్లులకు మద్దతు ఇస్తూ, చివరకు ఇలా రాష్ట్రానికి ఏమి చేయకుండా, కేంద్రం రాష్ట్రం కలిసి ఏపి గొంతు కొస్తున్నాయి. ఏపి ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయటం లేదో అర్ధం కావటం లేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read