ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెరాయిన్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా కొన్ని వేల కోట్ల రూపాయల హెరాయిన్ పట్టుబడటం, అది విజయవాడకు లింక్ ఉందని తేలటంతో, ఈ కేసు ఒక సెన్సేషన్ అయ్యింది. గత నెల 16వ తేదీన, తాలిబన్ల నుంచి దాదాపుగా 3 వేల కిలోల హెరాయిన్ గుజరాత్ లోని ముంద్రా పోర్టుకు వచ్చింది. టాల్కం పౌడర్ ముసుగులో, ఈ హెరాయిన్ దిగుమతి అయ్యింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఆ పార్సిల్ పై, విజయవాడకు చెందిన ఆషి ట్రేడింగ్ కంపెనీ అనే కంపెనీ పేరు రాసి ఉంది. దీంతో ఒక్కసారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. తాలిబన్ల నుంచి, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 వేల కిలోల హెరాయిన్, అదీ విజయవాడకు రావటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేసారు. పెద్ద పెద్ద వాళ్ళ సహాయం లేకపోతే ఇది జరాదని అందరూ భావించారు. అయితే రాష్ట్ర డీజీపీ స్పందిస్తూ, అసలు అషీ ట్రేడింగ్ కంపెనీ అనేది ఒక డమ్మీ కంపెనీ అని, విజయవాడ పేరు మాత్రమే వాడుకున్నారని తెలిపారు. అయితే టిడిపి మాత్రం డీజీపీ చేసిన ప్రకటన తప్పు అని చెప్తుంది. గత ఏడాది కాలంగా, ప్రతి నెల జీఎస్టీ కడుతున్నారని, అది డమ్మీ కంపెనీ అని ఎలా చెప్తారు అంటూ, కౌంటర్ చేయటంతో, ఈ విషయం పై అటు వైపు నుంచి ఇప్పటికీ సమాధానం లేదు.

center 06102021 2

అయితే ఇది మరో టర్న్ తీసుకుని, కాకినాడ లింకులు బయట పడ్డాయి. ఒక న్యూస్ ఛానల్ లో, అషీ ట్రేడింగ్ కంపెనీ సుధాకర్, కాకినాడలో ఆలీషా అనే సముద్రపు డాన్ దగ్గర పని చేసే వారని, ఈ ఆలీషా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనిషి అంటూ కధనాలు రావటం, ఈ లింకులు ఆఫ్రికా వరకు ఉండటం, దీన్ని టిడిపి రచ్చ రచ్చ చేయటంతో, ప్రతి రోజు ఈ విషయం పై ఏపిలో చర్చ జరుగుతుంది. అయితే ఏపి పోలీసులు మాత్రం, ఈ విషయం పై గతంలో ఇచ్చిన స్పందన తప్ప ఏమి లేదు. ఇక జాతీయ స్థాయిలో, ఈ విషయం పై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హెరాయిన్ విషయంలో, ఏకంగా విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్లు భావించిన కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసుని ఎన్ఐఏకు బదిలీ చేస్తూ కొద్ది సేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి మాదకద్రవ్యాల దిగుమతిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. ఏ దేశాల నుంచి ఎప్పటి నుంచి దిగుమతి చేసారు అనే విషయం పై ఎన్ఐఏ దర్యాప్తు చేయనుంది. మరి ఈ విషయంలో బిగ్ బాస్ బయట పడతారో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read