ఈ రోజు విశ్వంలో ఒక అద్భుతం జరగబోతుంది. అదేంటంటే, నీలాకాశంలో కాంతులు వెదజలల్లే జెమినిడ్స్ ఉల్కాపాతం. ఈ మిరుమిట్లు గొలిపే ఉల్కాపాతం, ఈ రోజు రాత్రి 9 గంటల తరువాత వీక్షించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  కానీ ఇక్కడ నిరాస పరిచే విషయం ఏంటంటే దీన్ని మామూలు కంటితో చూడలేమని  ప్లానెటరీ సొసైటీ వెల్లడించింది. ఈ జెమినిడ్స్ ఉల్కాపాతం భూవాతావరణం తాకి కాంతిజ్వాలగా మారనున్న ధూళి రేణువులని వారు చెబుతున్నారు. ఈ జెమినిడ్స్ ఉల్కాపాతం 17 వరకు కొనసాగుతుందని తెలిపారు. దీంతో ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు, ముఖ్యంగా పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. దగ్గరలో ఉన్న ప్లానిటోరియంకు వెళ్లి, ఈ అద్భుతాన్ని చూడనున్నారు. ప్రజల కోసం తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read