పల్నాడులో వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి, టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కు మధ్య వార్ ఒక రేంజ్ లో జరుగుతుంది. బీసీలకు ఇచ్చే పదవులపై ఇద్దరు నేతల మధ్య తీవ్రంగా మాటల యుద్ధం జరుగుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఒక్కటే పదవి ఇచ్చారని, వైసిపిప్రభుత్వం వచ్చాక ఎనిమిది మంది బీసీలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని, అంతే కాకుండా బీసీలకు, రాష్ట్ర, నియోజకవర్గ పదవుకూడా వైసిపి ప్రభుత్వం ఇచ్చిందని ,మేము బీసీలకు అండగా ఉన్నామని, అందుకే వైసీపీ రాష్ట్రస్థాయి బీసీ సదస్సు కూడా నిర్వహించిందని ఆయన చెపారు. ఇది చూసే టిడిపి వాళ్లు పల్నాడులో బీసీ సదస్సు నిర్వహిస్తున్నారని కాసు మహేష్ రెడ్డి, టిడిపి నేత యరపతినేని పై రెచ్చిపోయారు. దానికి, యరపతినేని కూడా ఒక రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీలు నిరసనలు చేస్తున్నారని, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురజాలలో బీసీలను హ-త్య చేసారని యరపతినేని విరుచుకుపడ్డారు.
బీసి లకు ఎవరు ఏమి చేసారో తేల్చుకుందాం అంటూ ఇరువురు నేతలు సవాళ్ళు విసురుకున్నారు. అయితే వాస్తవంలో మాత్రం, టిడిపి బీసీ నేతలు పల్నాడులో హ-త్యకు గురయ్యారు. జల్లయ్య లాంటి నేతలను టిడిపి కోల్పోయింది. బలమైన బీసీ నేతలు టార్గెట్ అయ్యారు. దీంతో పల్నాడులో ప్రతి రోజు టెన్షన్ గానే సాగుతుంది. గత నెలలో కూడా ఇరువు నేతలు పల్నాడు అభివృద్ధి పై సవాళ్ళు విసురుకున్నారు. బహిరంగ చర్చల వరకు ఈ సవాళ్ళు వెళ్ళాయి. అయితే అప్పట్లో కుదర లేదు. చంద్రబాబు మొన్న గుంటూరు జిల్లాలో పర్యటన చేయటంతో, మళ్ళీ పొలిటికల్ హీట్ రాజేసుకుంది. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉండటంతో, పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. రోజురోజుకి వీళ్ళ మద్య వైరం తీవ్ర స్థాయికి చేరుకోవడం తో పల్నాడు అంత ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఎన్నికలు మరో ఏడాది ఉన్న సమయంలో, ఈ పొలిటికల్ హీట్ రోజు రోజుకీ పెరుగిపోతుంది. రాజకీయం వరకు ఉంటే పరవాలేదు కానీ, ఇవి ఎటు దారి తీస్తాయో అని ప్రజలు భయ పడుతున్నారు.