ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీ విషయం పై గత కొద్ది రోజులుగా వార్తల్లో వినిపిస్తున్న వేళ, తాజాగా మరో అప్దేడ్ వచ్చింది. నిన్న హైదరబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న చంద్రబాబు నివాసం వద్దకు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు వచ్చి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. ముఖ్యంగా చంద్రబాబు ఇంటికి వెళ్ళే మూడు మార్గాలు పోలీసులు ఆధీనంలో మూసివేసి ఉంటాయి. వీటిని వదిలేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై నిన్న ఇరు రాష్ట్రాల అధికారులు ఆడిట్ చేసారు. ఇలా చేస్తే ఆ ఏరియాలో ట్రాఫిక్ ఫ్రీ అవుతుందని వారి అభిప్రాయం. ఇందు కోసం నిన్న తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ శ్రీనివాసరావు, అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంటెలిజెన్స్ డీఎస్పీ రవీందర్‌రెడ్డి , ఇతర ట్రాఫిక్ అధికారులు, అలాగే ఫైర్ సిబ్బంది వచ్చి చంద్రబాబు నివాసం దగ్గర పరిస్థితి ఎలా ఉంది, ఏమి చేయాలి అనే విషయం పై చాలా సేపు ఫీల్డ్ లో ఉండి మొత్తం పరిశీలించారు.
చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, మధుసూదన్‌తో కూడా కలిసి, ఏమి చేయాలి అనే విషయం పై చర్చించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 1 నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 65 వరకు ఒక దారి, అలాగే 36లో హెరిటేజ్ పక్క నుంచి, రోడ్ నంబరు 45 మీదుగా హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వరకు ఒక దారి లో నుంచి చంద్రబాబు నివాసానికి వెళ్ళవచ్చు. అయితే రోడ్ నంబరు 45 నుంచి వచ్చే వాహనాలను వదిలేస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికి మూసి ఉన్న మూడు రోడ్లలో, సగం వాటిల్లో ట్రాఫిక్ వదిలేయాలని భావిస్తున్నారు. దీని పైన నిన్న ఇరు రాష్ట్రాల అధికారులు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. మరి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరో పక్క చంద్రబాబు పర్యటనల నేపధ్యంలో, వైసీపీ వరుస పెట్టి రాళ్ల దా-డు-లు , అడ్డగింతలు లాంటివి చూసి, ఇప్పటికే కేంద్రం ఆయన జెడ్ ప్లస్ సెక్యూరిటీని డబుల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో, చంద్రబాబు ఇంటి దగ్గర తెలంగాణా, ఏపి అధికారులు సెక్యూరిటీ ఆడిట్ చేసారు.