పశుసంవర్థకశాఖా మంత్రి సీదిరి అప్పలరాజుని టిడిపి పలాస ఇన్చార్జి పశువు అంటుంటారు. డాక్టర్ అయిన ఒక మంత్రిని ఇలా అనడమేంటి అని చాలా మంది వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే నీచపు కూతలు కూస్తుండడం, పశువు కంటే దుర్మార్గంగా ప్రవర్తిస్తుండడంతో ఇలా పశువు అనక తప్పడంలేదని గౌతు శిరీష అంటుంటారు. టిడిపి అధినేత చంద్రబాబు కందుకూరు పర్యటనలో తొక్కిసలాట జరిగి 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందిస్తూ కందుకూరులో జరిగింది ప్రమాదం కాదు అని, దాని వెనుక కుట్ర ఉందంటారు. నేషనల్ మీడియాలో హైప్ కోసమే ఈ కుట్ర పన్నారని అవాకులు చెవాకులు పేలారు. పథకం ప్రకారం తొక్కిసలాట జరిపించి 8 మందిని చంపేశారని, చంద్రబాబును విచారించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది చనిపోయి కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ రోదిస్తుంటే, శవరాజకీయాలకు తెరతీసిన మంత్రి సీదిరి అప్పలరాజుని శిరీష పశువు అనడం తప్పులేదని జనాలు అనుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నవాడిని పశువు అనే అంటారంటున్నారు టిడిపి నేతలు.
అందుకేనా సీదిరి అప్పలరాజుని గౌతువు శిరీషా పశువుల మంత్రి అంటారు
Advertisements