ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన నుంచి ప్రతిపక్షం హక్కులకు దిక్కులేదు. ప్రశ్నించే ప్రజల్నీ నిర్బంధిస్తున్నారు. అయినా టిడిపి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు ఎన్నో దా-డు-లని ఎదుర్కోవాల్సి వస్తుంది. టిడిపి తలపెట్టే సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. శాంతియుతంగా ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగిస్తున్న టిడిపిపై ఇప్పటివరకూ ఖాకీలే ప్రతాపం చూపేవారు. ఇప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే గూండాల్లా మారి టిడిపి కార్యక్రమాలపై దా-డు-లకు దిగుతున్నారు. ఈ దా-డు-లు చూస్తూ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. మాచర్లలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి నిర్వహించిన టిడిపిపై వైసీపీ చేసిన దా-డు-లు రాష్ట్రమంతా నివ్వెరపోయి చూసింది. టిడిపి ఆఫీసు, టిడిపి నేతల ఇళ్లు లూటీలు చేశారు. కార్లు కాల్చేశారు. పోలీసులు మాత్రం వైసీపీ పెద్దల ఆదేశాలతో టిడిపిపై నాన్ బెయిలబుల్ కేసులు బనాయించారు. మంత్రి పెద్దిరెడ్డి ఇలాఖా పుంగనూరు, తంబళ్లపల్లెలోనూ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని అడ్డుకుని టిడిపి నేతల ఇళ్లపై దా-డు*లకి దిగారు.
గుడివాడలో రంగా వర్ధంతి టిడిపి నిర్వహించకూడదంటూ ఏకంగా పెట్రోల్ బాంబులు వేసి చంపేస్తామంటూ టిడిపి ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావుని బెదిరించారు. టిడిపి నేతలపై దా-డు-లకి దిగారు. ఇక్కడా పోలీసులు కాంతారా సినిమా చూసినట్టు వైసీపీ దౌర్జన్యాలను చూస్తూ ఉన్నారు. ఉన్నట్టుండీ వైసీపీలో ఇంత అసహనం ఎందుకు పెరిగిపోయింది అనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకులని తొలిచేస్తున్న ప్రశ్న. తాము గడప గడపకీ వెళ్తుంటే తిరగబడుతున్న ప్రజలు, టిడిపి చేపట్టిన `ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ` కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారని ఆ అక్కసా? ఐప్యాక్, ఆత్మసాక్షి గ్రూపులు చేసిన సర్వేలో ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత కారణంగానా? ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు సభలకు జనం పోటెత్తుతుండం ఓర్వలేక ఇలా దాడులు చేసి భయపెడుతున్నారా? అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి.