నిన్న రాత్రి కందుకూరులో జరిగిన ఘటన జరిగినప్పటి నుంచి చంద్రబాబు తీవ్ర భావోద్వేగంలో ఉన్నారు. నిన్న రాత్రి నడుచుకుంటూ హాస్పిటల్ కు వెళ్ళిన చంద్రబాబు, తీవ్ర విషాద స్వరంతో, జరిగిన విషాదాన్ని బహిరంగ సభలో చెప్పి, కుటుంబాలని ఆదుకుంటామని చెప్పారు. ఇక నిన్న రాత్రి నుంచి పోస్ట్ మార్టం ఏర్పాట్లు, అంత్యక్రియల ఏర్పాట్లు, అన్నీ చంద్రబాబు దగ్గరుండి చూస్తున్నారు. అందరి అంత్యక్రియలు టీడీపీ తరపున చేయనున్నారు. తొక్కిసలాటలో మరణించిన కార్యకర్తల అంత్యక్రియలకు పార్టీ ఇన్‍ఛార్జ్ లు, ఎమ్మెల్యేలు వెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఒక్కో నేతకు, ఒక్కో బాధ్యత ఇచ్చారు. పోస్ట్ మార్టం దగ్గర నుంచి, ఇంటికి వెళ్ళే వరకు, తరువాత అంత్యక్రియలు పూర్తి చేసే వరకు, కుటుంబ సభ్యులతో ఉండాలని తెలిపారు. వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం ఇవ్వాలని ఆదేశించారు. వారికి మనోధైర్యం ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. తాను కూడా స్వయంగా పాల్గుంటానని, ఈ రోజు కందుకూరులో జరిగే పార్టీ కార్యక్రమాలు అన్నీ రద్దు చేస్తున్నట్టు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read