వైసిపి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, జనం నుంచి రోజుకొక చోట చీత్కారాలు ఎదురౌవుతున్నాయి. తాజాగా వైసిపి మంత్రి బుగ్గనరాజేంద్రకు నిరసన సెగ తగిలింది. ప్యాపిలి మండలంలోని వెంగళంపల్లికి వెళ్ళిన బుగ్గనను మహిళలు కడిగిపారేశారు. రోడ్డు పనులకు శంకుస్థాపన చేయాడానికి వెళ్ళిన బుగ్గనను మహిళలు చుట్టుముట్టారు. తమకు ఎప్పటి నుంచో ఉన్న తాగునీటి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ బుగ్గనను నిలదీశారు. ఒక పక్క మహిళలు తమకు ఉన్న సమస్యలు చేబుతుంటే బుగ్గన వినకుండా నిదానంగా అక్కడ నుంచి జారుకున్నారు. కాని మహిళలు మాత్రం అరుస్తూనే ఉన్నారు. ఎన్నికల అప్పుడు మా ఊరికి రోడ్లు వేయిస్తాం అని, కాల్వలు వేయిస్తాం అని, తాగునీటి సమస్యను తీర్చుతామని చెప్పి ఇప్పుడెమో, అడుగుతుంటే ముఖంతిప్పుకుని వెళ్ళిపోతారా అంటూ మహిళలు బుగ్గన పై ఆగ్రహం వ్యక్తం చేసారు.
Advertisements