మంచి వ్యూహంతో వేసిన ఒక ముందడుగు వల్ల రెండు ప్రయోజనాలు కలగడం, ఇద్దరికి చెక్ పెట్టడం వంటి వాటిని ఒక దెబ్బకి రెండు పిట్టలు అంటారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కూడా తెలివిగా విసిరిన ఒక పంచ్ ఇరురాష్ట్రాల్లో రెండు అధికార పార్టీలకు గట్టిగా తగిలింది. ఇప్పటివరకూ తెలంగాణలో ఓటుకు నోటుకు భయపడి అమరావతి వచ్చారని ఒకసారి, ఏపీలో ఉండకుండా హైదరాబాద్ పారిపోతున్నారని మరోసారి రెండు నాలుకల విమర్శలకు నేరుగా కౌంటర్ ఇవ్వకుండా ఖమ్మం తెలుగుదేశం శంఖారావాన్ని వినిపించారు బాబు. మాది తెలుగుదేశం పార్టీ. తెలుగు రాష్ట్రాల క్షేమం కోరే పార్టీ. ఇక్కడా ఉంటుంది. అక్కడా ఉంటుంది అంటూ బలమైన సంకేతాలు ఇచ్చారు చంద్రబాబు. తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి రాదు. కానీ ఎవరు అధికారంలోకి రావాలో డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కావడం ఖాయమని పార్టీలకు తెలుసు. తెలుగుదేశం పార్టీ అధినేత ఖమ్మం సభ అనుకున్న దాని కంటే చాలా విజయవంతమైంది. ఇది ఎవరో ఎల్లో మీడియా చేసే ప్రచారం కాదు. ఖమ్మంలో పసుపు రెపరెపలు గులాబీ కోటలో గుబులు పుట్టించాయి. ఫ్యాన్ రెక్కలు టపటపా కొట్టుకోవడం ఆరంభించాయి. చంద్రబాబు ఎవ్వరినీ ఒక్క విమర్శ చేయకుండా, తాను చేసిన అభివృద్ధి, తెలంగాణతో తనకు గల బాండింగ్, తెలుగుదేశం తెలంగాణ బంధం వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read