రైల్వే ప్రాజెక్టులకు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  హ్యాండ్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లనే కోటిపల్లి నర్సాపూర్ న్యూలైన్(57.21 కి.మీ.)  ప్రాజెక్ట్ ఆగిందని  కేంద్రం తేల్చి చెప్పింది. ఆగిందన్న ప్రాజెక్టులో వాళ్లు ఇవ్వాల్సిన వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వకుండా ఆటలాడుతుందని, ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 25 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించడం లేదాని కేంద్రం ఆరోపించింది. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం అయ్యే రూ.2,120 కోట్ల రూపాయలని, అందులో  కేంద్రప్రభుత్వం  రూ.1091 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆంద్రప్రదేశ్  ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు రూ.2.69 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఇంకా రూ.354 కోట్లు చెల్లించాల్సి ఉందని, కేంద్ర రైల్వే మంత్రి రాజ్యసభలో చెప్పారు. తెలుగుదేశం  ఎంపీ కనకమేడల  అడిగిన ప్రశ్నకు,  రైల్వే మంత్రి ఈ సమాధానం చెప్పడంతో, రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read