ఉత్త‌రాంధ్ర‌లో తెలుగుదేశం ఊపు చూస్తుంటే, క్లీన్‌స్వీప్ ఖాయ‌మ‌ని స్ప‌ష్టం అవుతోంది. టిడిపి కంచుకోటలాంటి ఉత్తరాంధ్ర‌లో మ‌ళ్లీ పార్టీకి పూర్వ‌వైభ‌వం వ‌చ్చింద‌ని ప‌సుపు సైనికులు సంబ‌రాల్లో మునిగి తేలుతున్నారు. నిన్న‌టి బొబ్బిలి స‌భ‌లో చంద్ర‌బాబు సైకో జ‌గ‌న్ పోవాల‌ని పిలుపుని ఇవ్వ‌బోయి, పొర‌ప‌డి సైకిల్ పోవాల‌ని అంటూనే నాలిక్క‌రుచుకున్నారు. అయితే ఉత్త‌రాంధ్ర జ‌నం ఉద్రేకం చూస్తుంటే, చంద్ర‌బాబు సైకిల్ పోవాల‌ని పిలుపునిచ్చినా..జ‌నం మాత్రం సైకో జ‌గ‌న్ రెడ్డి పోవాల‌ని ఫిక్సయ్యారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో షెడ్యూల్ ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు చంద్ర‌బాబు స‌భ ప్రారంభం కావాలి. మ‌ధ్యాహ్నం 1 గంట‌కే ప‌రిస‌ర ప‌ల్లెల నుంచి చేరుకున్న జ‌నంతో రాజాంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. అటు బొబ్బిలి రోడ్డు, ఇటు పాల‌కొండ రోడ్డు, మ‌రో వైపు శ్రీకాకుళం రోడ్డు, ఇంకోవైపు సార‌ధి రోడ్డు కిలోమీట‌ర్ల మేర‌కు జ‌నంతో నిండిపోయింది. విశాఖ ప‌ట్ట‌ణం నుంచి తోవ పొడ‌వునా చంద్ర‌బాబు రాక కోసం త‌ర‌లివ‌చ్చినా జ‌నాన్ని విజ‌య‌సంకేతం చూపుతూ రాజాం స‌భ‌ని చేరేస‌రికి 5 గంట‌లకి పైగా ఆల‌స్య‌మైంది. వృద్ధులు సైతం స‌భాస్థ‌లి నుంచి వెళ్ల‌కుండా బాబుగారి రాక‌కోసం చ‌లిలోనూ, మంచులోనూ నిలుచునే ఉన్నారు.

రాజాం తెలుగుదేశం మూడు గ్రూపులైపోయింద‌ని, వారి అనైక్య‌తే త‌మ బ‌ల‌మ‌ని లోలోప‌ల సంతోషిస్తున్న వైసీపీ లీడ‌ర్ల‌కి టిడిపి కేడ‌ర్ త‌మ స‌త్తా చూపించారు. మాది చంద్ర‌బాబు గ్రూపు, తెలుగుదేశం వ‌ర్గ‌మంటూ నిన‌దించారు. రాజాం నుంచి బొబ్బిలి వైపు చంద్ర‌బాబు కాన్వాయ్ సాగింది. రాజుల‌కాలంలో బొబ్బిలి సామంత రాజ్యం రాజాం. త‌మ పాల‌న‌లోని రాజాం తెలుగుదేశం వెలుగుల‌తో జిగేల్మంటే, తాము త‌క్కువ తిన్నామా అంటూ బొబ్బిలి రాజులు త‌మ నియోజ‌క‌వ‌ర్గం ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు కురిపించారు. కిలోమీట‌ర్ల మేర జ‌న‌మే పూల‌దారులై చంద్ర‌బాబుని స్వాగ‌తించారు. బొబ్బిలికోట‌లో చంద్ర‌బాబు స‌భ జ‌న‌సునామీని త‌ల‌పించింది. ఉత్త‌రాంధ్ర‌లో తెలుగుదేశం ఊపు చూస్తుంటే, చంద్ర‌బాబు పొరపాటున నోరు జారి సైకిల్ పోవాల‌ని కోరుకున్నా..జ‌నం మాత్రం సైకిల్ మాత్ర‌మే కావాలి అని కోరుకుంటున్నార‌ని స్ప‌ష్టం అవుతోంది. చంద్ర‌బాబు అడ్డుకున్నా ఫ్యాన్ పెడ‌రెక్క‌లు విరిచి శెన‌గ‌గింజ‌ల‌కి వేసేయ‌డం ఖాయం అంటున్నారు జ‌నం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read