Sidebar

27
Sun, Apr

గుడివాడలో హైటెన్షన్ నెలకొంది. తెలుగుదేశం నేత రావి వెంకటేశ్వరరావుకు గడ్డం గ్యాంగ్ బహిరంగంగా బెదిరింపులు దిగింది. రావివెంకటేశ్వరరావుకి ఫోన్ చేసి చంపేస్తామంటూ గడ్డం గ్యాంగ్ నేత బెదిరింపులు దిగింది. ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా దూషించారు గడ్డం గ్యాంగ్ నేతలు, టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతుండగానే పెట్రోల్ కవర్లతో టీడీపీ నేతలపై దాడికి ప్రయత్నించింది గడ్డం గ్యాంగ్. ఈ ఘటనను మొత్తం వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులపైనా గడ్డం గ్యాంగ్ దా-డికి దిగింది. మీడియా ప్రతినిధుల సెల్‍ఫోన్‍లను గడ్డం గ్యాంగ్ నేలకేసి కొట్టి నాశనం చేసారు. రావి అనుచరులు, గడ్డంగ్యాంగ్ మధ్య వాగ్వాదం జరగటంతో పోలీసుల మోహరించారు.గడ్డం గ్యాంగ్ నేత కాళీ ఇంటికి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులను యత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేసారు. పోలీసులతో టీడీపీ నేతల వాగ్వాదం జరగటంతో, గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రేపు రావి రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉండటంతో, టీడీపీ ఆ కార్యక్రమం నిర్వహించొద్దని వైసీపీ శ్రేణులు హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read