ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు యువత ఆత్మహ-త్య-లు పెరిగిపోతున్నాయని కేంద్రం పార్లమెంట్ లో లెక్కలతో సహా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ గిరిజనులపై దా-డు-లు కూడా రోజురోజుకు ఎక్కువతున్నట్లు పార్లమెంట్లో గణాంకాలతో సహా కేంద్రం వెల్లడించింది. భారత దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గిరిజనులపై జరుగుతున్న దాడుల, కేసులు తగ్గుముఖం పడుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పెరిగినట్లు కేంద్రం స్పష్టం చేసింది. 2019వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ అకృత్యాలకు సంబంధించి 330 కేసులు ఫైల్ కాగా.. 2021 సంవత్సరంలో 361 కేసులు నమోదు అయ్యాయి. ఇంకోవైపు యువత ఆ-త్మహ-త్య-లు కూడా ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్నాయి. 2019 సంవత్సరంలో 6,465 మంది ఆత్మహత్యలు చేసుకుంటే , అది 2021 కి 8,067కు గణనీయంగా పెరిగిపోయిందని కేంద్రం తేల్చి చెప్పింది. మొత్తానికి మన రాష్ట్రం, అభివృద్ధి లో ముందజలో లేకపోయినా , హ-త్య-లు, ఆ-త్మ హ-త్య-ల్లో మాత్రం కేంద్ర స్థాయిలో రికార్డులు కైవసం చేసుకుంది.
ఏపి షాక్ అయ్యే విషయం చెప్పిన లోకసభ... ఎటు పోతుంది రాష్ట్రం ?
Advertisements