నెల్లూరు కరకట్ట కమల్ హాసన్ గా పేరుపడిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి నేత అల్లాబక్షుపై దా-డి తో పాటు మైనార్టీ నేత సాబీర్ ఖాన్ పై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ముస్లిం మైనార్టీలు నెల్లూరు విఆర్సి సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హటావో ముస్లిం మైనారిటీ బచావో అని రూరల్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో కు వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యల పై ప్రశ్నించినందుకు, ముస్లిం నేతలపై, దా-డు-లు చేయడం, అక్రమ కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. మాట్లాడితే కేసులు పెట్టేస్తారా, ప్రశ్నిస్తే చంపేస్తారా అని ప్రశ్నించారు.
Advertisements