జగన్ మోహన్ రెడ్డిని గెలిపించానని చంకలు గుద్దుకున్నాడు కేసీఆర్. ఇక ఏపీలోనూ టీఆర్ఎస్ దే అధికారం అన్నంతగా జగన్ మోహన్ రెడ్డి మొదట్లో వంగిపోయాడు. విందు వినోదాలలో పరస్పరం ప్రేమ చూపించుకున్నారు. తెలంగాణ నుంచి ప్రతిపాదన రావడమే తరువాయి ఏపీ సై అంటూ సంతకం పెట్టేయడమే. అన్నీ వదులుకున్న జగన్ మోహన్ రెడ్డికి సడెన్ గా ఏపీ ఆస్తుల విభజన గుర్తొచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజనపై సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రూ.1,42,601 కోట్ల విలువైన ఆస్తులను విభజించకుండా తెలంగాణ కాలయాపన చేస్తోందని ఏపీ ఆరోపణ చేసింది. విభజన జరగాల్సిన 91 శాతం ఆస్తులు హైదరాబాద్ లోనే ఉన్నాయని ఏపీ వాదన వినిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లయినా ఆస్తుల విభజనకు తెలంగాణ సహకరించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం ఏపీ ప్రజల హక్కులకు తెలంగాణ భంగం కలిగించిందంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.

kcr 15122022 2

ఆస్తుల విభజన త్వరగా జరిగేలా ఆదేశాలివ్వాలని ఏపీ సర్కారు సుప్రీంకోర్టుని కోరడం కలకలం రేపుతోంది. ఎందుకంటే ఏపీలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి త్వరలో నాలుగేళ్లు పూర్తవుతోంది. ఈ కాలంలో ఏ ఒక్క రోజూ ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు గురించి నోరు ఎత్తి అడిగింది లేదు. ఏపీ వాటాగా వచ్చిన లక్షల కోట్ల భవనాలు తెలంగాణ సర్కారు అడిగిన వెంటనే ధారాదత్తం చేసేశాడు జగన్ మోహన్ రెడ్డి. తెలంగాణ సీఎం కేసీఆర్ వాటేసుకుని, స్వీట్లు పంచుకుని ప్రేమ కురిపించిన జగన్ మోహన్ రెడ్డి ఇంత సడెన్గా తెలంగాణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వెనుక ఏదో కుతంత్రం ఉంటుందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల మధ్య అనేక వ్యూహాలు నడుస్తున్న వేళ, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం వెనుక, ఏమి స్కెచ్ ఉంది అనేది చూడాలి మరి. చూద్దాం ఏమి జరుగుతుందో..

Advertisements

Advertisements

Latest Articles

Most Read