సీబీఐ-ఈడీ పెట్టిన కేసుల్లో ఏ1 జగన్ మోహన్ రెడ్డి అయితే ఏ2 విజయసాయిరెడ్డి. ఇద్దరూ ఒకే జైలులో చాలా కాలం ఉన్నారు. మామా అల్లుళ్ల బంధం కంటే ఆర్థిక సంబంధం వీరి మధ్య విడదీయలేనిది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పార్టీలో నెంబర్ 2గా విజయసాయిరెడ్డి హవా బాగానే సాగింది. రాజ్యసభ సభ్యుడు, కేంద్రంతో స్నేహం వల్ల వచ్చిన పదికి పైగా పదవులు సాయిరెడ్డి సొంతమయ్యాయి. ఉత్తరాంధ్రకి అనధికార ముఖ్యమంత్రిగా సాయిరెడ్డి కొనసాగారు. భూముల కుంభకోణాలు, కబ్జాలని ఆరోపణలు వచ్చినా చూసీచూడనట్టు వదిలేశారు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలంతా మాకు ఈయన వద్దు బాబోయ్ అని వేడుకున్నా జగన్ రెడ్డి కనికరించలేదు. ఏమైందో ఏమో హఠాత్తుగా విజయసాయిరెడ్డిని దూరం పెడుతూ వస్తున్నారని వైసీపీలో నేతలకు అర్థం అయిపోయింది. ఉత్తరాంధ్ర బాధ్యతలు ఊడపీకేశారు. సోషల్మీడియా బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించకుండా, సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం ద్వారా పొమ్మనకుండా పొగబెట్టినట్టయ్యింది. ఒక్కో కీలక బాధ్యతల నుంచి జగన్ రెడ్డి తప్పిస్తుండడంతో సాయిరెడ్డి పని అయిపోయిందని వైసీపీ బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
విజయసాయి రెడ్డికి ఏమైంది ? వైసీపీలో హవా తగ్గిపోయిందా ? ఎందుకు దూరం పెడుతున్నారు ?
Advertisements