ఆంద్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న దిగజారుడు నిర్ణయాలను ప్రజలు రోజురోజుకి ఛీ కొడుతున్నారు. వైసిపి మంత్రులు  మీడియా సమావేశాలు పెట్టి బూతులు తిట్టడం రేంజ్ దాటేసి ,ఇప్పుడు కలక్టర్లను తిట్టమంటున్నారు.  ఉన్నత హోదాలో ఉన్న నేతలే ఇలా ప్రవర్తిస్తున్నారు, వీరు సామాన్య జనానికి ఏం చెప్తారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం, పోలీసులు చేత చేయిస్తున్న ఒక  సర్వే చాలా వివాదాస్పదం అయ్యింది. ఈ సర్వే చేయాల్సిన బాధ్యతలను  మహిళా పోలీసులకు అప్పచెప్పారు. ఈ సర్వే కోసం స్పెషల్ యాప్ కూడా ఫిక్స్  చేసారు. దీని కోసం మహిళా పోలీసుల చేత అడిగించే ప్రశ్నల కోసం అడ్డదిడ్డమైన, అర్ధం లేని ఒక ప్రశ్నాపత్రం తయారు చేసారు. దాంట్లో  నీ మొగుడికి  ఎందరు భార్యలు? సీక్రెట్ ఎఫైర్స్ ఏమైనా నడుపుతున్నాడా?  మీ ఆయన  మిమ్మల్ని బాగా కొడతాడా? మీ ఆయనపై గృహహింస కేసులున్నాయా ? అంటూ సామాన్య మహిళను ప్రశ్నలతో వేదిస్తున్నారు మహిళా పోలీసులు. దాంతో మా పర్సనల్ లైఫ్ గురించి నిలదీయడానికి మీరెవరు అంటూ జనం తిరగబడ్డారు.  మేము చెప్పకుండా ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నరంటూ మహిళలు ఆగ్రహంతో ఊగిపోయారు. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి. వీళ్ళు ఇచ్చిన ఈ సమాచారాన్ని వైసిపి ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటారని  అనుమానాలు వ్యక్తం చేసారు. కాని వీళ్ళ ప్లాన్ బెడిసి కొట్టింది. మహిళలు నుంచి ఈయాప్ పై తీవ్ర వ్యతిరేఖత రావడంతో ప్రస్తుతానికి దీన్ని వెనక్కు తీసుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read